NTV Telugu Site icon

MK Stalin: మరోసారి డీఎంకే అధినేతగా స్టాలిన్.. ఏకగ్రీవంగా ఎన్నిక

Mk Stalin

Mk Stalin

MK Stalin Elected As DMK Chief For 2nd Time: ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. ఇప్పటికే ఓసారి పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహిాంచిన స్టాలిన్.. వరసగా రెండో సారి కూడా పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన్న పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగనన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీకి సంబంధించిన కీలక పదవులను ముగ్గురు నేతలు రెండోసారి ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నారు.

జనరల్ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్ కు డీఎంకే పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వివిధ పదవులకు ఎన్నికలు జరిగాయి. చివరగా పార్టీ అధ్యక్షుడు, కోశాధికారి, ప్రధాన కార్యదర్శికి ఎన్నికలు జరిగాయి. 69 ఏళ్ల స్టాలిన్ 2018లో కరుణానిధి మరణం అనంతరం డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా రెండో సారి మరోసారి ఎన్నికయ్యారు. 1969లో డీఎంకేకు మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. పార్టీలో అధ్యక్ష పదవని తీసుకురావడం అప్పుడే మొదటిసారి. 1949లో స్థాపించిన డీఎంకే పార్టీకి అప్పటి వరకు ద్రవిడ ఉద్యమ నేత, పార్టీ డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1969లో ఆయన మరణించేన వరకు అత్యున్నత పదవిలో ఉన్నారు. ఆ తరువాత కరుణానిధి అధ్యక్షుడు అయ్యారు.

ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. గతంలో డీఎంకే పార్టీలో కరుణానిధి పెద్ద కొడుకు, మరో కొడుకు స్టాలిన్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అయితే కరుణానిధి ఉన్న సమయంలో చెన్నై నుంచి ఉత్తర తమిళనాడు బాధ్యతలను స్టాలిన్ కు అప్పగిస్తే, మధురై కేంద్రంగా దక్షిణ తమిళనాడు పార్టీ బాధ్యతలను అళగిరి పర్యవేక్షించే వారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో అళగిరితో పోలిస్తే స్టాలిన్ క్రియాశీలకంగా ఉండేవారు. దీంతోనే కరుణానిధి తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ నే ఎన్నుకున్నారు.