Site icon NTV Telugu

Miyazaki Mangoes: బాబోయ్.. రెండు మామిడి చెట్లకు అంత సెక్యురిటీనా.?

Miazaki Mangoes

Miazaki Mangoes

మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు తన రెండు మామిడి చెట్లకు ముగ్గురు గార్డులను, 6 వాచ్‌డాగ్‌లను సెక్యురిటీగా పెట్టాడు. మీరు వింటున్నది నిజమే.. మామిడి చెట్లకు అది కూడా రెండింటికి ఇంత సెక్యురిటీ ఎందుకా.. అని ఆశ్చర్యపోతున్నారా.? అయితే ఇది అలాంటి ఇలాంటి మామిడి చెట్లు కావు. అరుదైన, అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి చెట్లు. మియాజాకి మామిడి పండ్ల ధర కేజీకి రూ. 2.7 లక్షలు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ రైతు తన మామిడి చెట్లను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా ట్విట్టర్ లో పంచుకున్నాడు.

రూబీ కలర్ లో ఉండే జపనీస్ మామిడి జాతి, మియాజాకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి, కిలో రూ.2.7 లక్షలకు విక్రయించబడింది. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో పరిహార్ అనే రైతు తన రెండు చెట్లను కాపాడుకునేందుకు ముగ్గురు సెక్యురిటీ గార్డులు, 6 కాపలా కుక్కలను నియమించుకున్నాడని హర్షాగోయెంకా ట్వీట్ చేశారు. అయితే ఓ నెటిజెన్ ఈ మామిడి పండు తింటే ఏం అవుతుందని ప్రశ్నించినప్పుడు.. ‘ఏముంది కడుపు నిండుతుందని’ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.

Read Also: Deepika Padukone: పెళ్లయ్యాక అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తే తప్పేంటి?

ఏడాది క్రితం పండ్ల తోటల పెంపకందారుడు సంకల్ప్ పరిహార్ అతని భార్య రాణిలు మియాజాకి రకానికి చెందిన రెండు మామిడి చెట్లను నాటారు. అయితే తొలుత ఈ మామిడి పండ్లు రూబీ కలర్ లో ఉంటాయని, వాటి ఖరీదు లక్షల్లో ఉంటుందని తెలియదు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి పండు అని తెలిసిన తర్వాత దీనికి భారీ రక్షణ ఏర్పాటు చేశాడు. మియాజాకి ఆకారం, ఎర్రటి రంగు కారణంగా ‘ఎగ్స్ ఆఫ్ సన్‌షైన్’ అని పిలుస్తారు. అయితే దీన్ని విలువ తెలిసిన తర్వాత స్థానిక దొంగలు వీటిని దొంగలించే ప్రయత్నం చేశారు. దీంతో అసాధారణ రీతిలో పరిహార్ ఈ రెండు చెట్లకు భద్రత కల్పిస్తున్నాడు.

మియాజాకి అనేది జపాన్ లో ఓ నగరం పేరు. సగటున ఒక్కో మామిడి పండు 350 గ్రాముల బరువు ఉంటుంది. యాంటీ ఆక్సికెంట్లు, బీటా-కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ ఈ మామిడి పండులో పుష్కలంగా ఉంటాయి. ఎప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో ఈ మామిడి పండ్లు కోతకు వస్తాయి.

 

Exit mobile version