ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా పట్టి పీడిస్తున్నది. కరోనాకు ప్రస్తుతం చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం రూపొందించిన టీకాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నా, మిశ్రమ టీకాలు వేయడం ఎలా ఉంటుంది అనే విషయంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.
Read: “అధీరా” కోసం అదిరిపోయే ప్లాన్ !
ఇలా మిశ్రమ టీకాలు వేయడం ప్రమాదకరమైన పోకడ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై ప్రస్తుతం తగినంత సమాచారం లేదని, పూర్తిగా అధ్యయనం కొనసాగిన తరువాత మాత్రమే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని తెలిపారు. మొదటి డోసు ఒక కంపెనీ వ్యాక్సిన్, రెండో డోసు మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకొవడం ప్రమాదం అని స్వామినాథన్ పేర్కొన్నారు.
