“అధీరా” కోసం అదిరిపోయే ప్లాన్ !

మోస్ట్ అవైటెడ్ మూవీ “కేజీఎఫ్-2” కోసం మేకర్స్ అదిరిపోయే ప్లాన్ వేశారట. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా విలన్ ‘అధీరా’కు హీరోతో పాటు సమానంగా ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ “అధీరా” లుక్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసింది. అయితే తాజా అప్డేట్ తెలిస్తే ఆ అంచనాలకు ఇక ఆకాశమే హద్దు మరి. దర్శకుడు ప్రశాంత్ నీల్ “అధీరా” కోసం స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. గతంలో ఎప్పుడూ ఓ విలన్ కోసం పరిచయం చేస్తూ సాంగ్ చేసే ధైర్యాన్ని చేయలేదు మన మేకర్స్. “అధీరా” ఎంట్రీ ఓ హై వోల్టేజ్ స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను విజిల్స్ వేయించేలా చేస్తుందని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలీదు కానీ… “కేజీఎఫ్-2” కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఇది గుడ్ న్యూస్.

Read Also : భరణి బహుముఖ ప్రజ్ఞ!

కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం యష్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా విడుదల కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-