NTV Telugu Site icon

Miracle Incident: చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. లేచి కూర్చున్న శవం

Dead Man Alive

Dead Man Alive

Miracle Incident In Hubli Kims Hospital: అప్పుడప్పుడు ఎవ్వరూ ఊహించని కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. కళ్ల ముందు జరిగే ఆ చమత్కారాలను చూసి షాక్‌కి గురవుతుంటారు. తాము చూస్తోంది నిజమేనా? అన్నట్టుగా ఆశ్చర్యచకితులైపోతారు. ఇప్పుడు కర్ణాటకలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక వ్యక్తి చనిపోయాడనుకుని, అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఇక ఆసుపత్రి నుంచి శవాన్ని తీసుకెళ్లడమే తరువాయి అని అనుకుంటుండగా.. ఆ వ్యక్తి ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నాడు. దీంతో.. అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. హుబ్లీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Love Proposal: కేదార్‌నాథ్ ధామ్ ముందు లవ్ ప్రపోజ్.. ఓవరాక్షన్ అంటున్న జనాలు

గదగ్‌ జిల్లా నరగుంద తాలూకా హిరేకొప్ప గ్రామానికి చెందిన సిద్ధప్ప పాములు పడుతుంటాడు. అయితే.. పాములు పట్టడానికి ముందు ఇతను మద్యం సేవిస్తాడు. ఇటీవల గ్రామంలోని ఓ ఇంట్లో పాము చొరబడిందని, సిద్ధప్పకు సమాచారం అందింది. దాంతో.. అతడు మద్యం సేవించి, ఆ పాముని పట్టేందుకు అక్కడికి వెళ్లాడు. ఎలాంటి సురక్షిత ఏర్పాట్లు లేకుండానే అతడు పాముని పట్టుకున్నాడు. ఆపై దాన్ని రోడ్డు మీద వదిలేశాడు కూడా. అయితే.. మద్యం మత్తులో ఉన్న సిద్ధప్ప, ఆ పాముని మళ్లీ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ పాము అతనిపై దాడి చేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు కాటేసింది. ఆ దెబ్బకు అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో.. కుటుంబ సభ్యులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Telugu Talli Flyover Accident: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

హుబ్లీ కిమ్స్ ఆసుపత్రికి సిద్ధప్పని తరలించగా.. వైద్యులు వెంటనే అతనికి చికిత్స అందించారు. అయితే.. పాము నాలుగు సార్లు కాటెయ్యడంతో, అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అతడు బతకడం కష్టమేనని చేతులు కూడా ఎత్తేశారు. దాంతో.. సిద్ధప్ప మరణించాడని భావించి, అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సిందిగా గ్రామంలోని బంధువులక సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి నుంచి అతడ్ని తీసుకుళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. సిద్ధప్ప ఒక్కసారిగా బెడ్‌పై లేచి కూర్చున్నాడు. ‘ఇదేందయ్యా ఇది, ఇది నేన్ సూడలే’ అన్నట్టు ఫ్యామిలీతో పాటు డాక్టర్లు సైతం అవాక్కయ్యారు. అనంతరం.. అతనికి వైద్యసేవలు అందించారు.