Site icon NTV Telugu

MUDA Land Scam: సిద్ధరామయ్యకు మద్దతుగా మైనారిటీ, బీసీ సంఘం పాదయాత్ర..

Muda Land Scam

Muda Land Scam

MUDA Land Scam: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) ల్యాండ్ స్కామ్‌ కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతికి ఈ స్కామ్‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మైసూర్ నగరాభివృద్ధికి పార్వతి నుంచి సేకరించిన భూమి విలువ కన్నా, నగరంలోని ప్రైమ్ ఏరియాల్లో అత్యంత ఖరీదైన 14 ప్లాట్లను కేటాయించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరగాలని బుధవారం కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు సీఎంపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని ఆదేశించింది.

Read Also: PM Modi: రూ.130 కోట్లతో తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన మోడీ..

మైనారిటీలు, వెనకబడిన తరగతులకు సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంలో రాజకీయ సామాజిక ఉద్యమం ‘నేషనల్ అహిందా ఆర్గనైజేషన్’ అక్టోబర్ 03న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతుగా మార్చ్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మద్దతు ఇవ్వాలని అహిందా ఆర్గనేషన్ భావించింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని కోరింది.

అహింద నాయకుడు (సిద్దరామయ్య)ని కాపాడేందుకు జాతీయ అహింద సంస్థ హుబ్బళ్లి నుంచి బెంగళూరు వరకు రాజ్యాంగ అవగాహన యాత్రను ప్రారంభిస్తున్నామని, ఈ పాదయాత్రలో వెనకబడిన తరగులు, దళితులు, అహిందా సంఘాల నాయకులంతా పాల్గొంటారని అహింద రాష్ట్ర అధ్యక్షుడు ముత్తన్న శివల్లి అన్నారు. సిద్ధరామయ్య అల్పసంఖ్యాకులు (మైనారిటీలు), హిందువులు (వెనుకబడిన తరగతులు),దళితులు (దళితులు) కోసం నిలబడే అహింద ఉద్యమానికి ప్రధాన వ్యక్తిగా పేర్కొన్నారు.

Exit mobile version