NTV Telugu Site icon

Bangladesh: బెదిరింపులతో బంగ్లా నుంచి భారత్ పారిపోయి వచ్చిన హిందూ బాలిక..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆడగం లేదు. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థను టార్గెట్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఈ సంస్థలో సంబంధం ఉన్న ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్‌ని, మరికొందరు హిందూ మత గురువుల్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. చిన్మోయ్ తరుపున వాదించే లాయర్లను కూడా అక్కడి ఇస్లామిస్ట్ రాడికల్స్ బెదిరిస్తు్న్నారు. హిందువుల ఆస్తులు, ఆలయాలు, వ్యాపారాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు. అక్కడి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడుల్ని అరికట్టలేకపోతోంది.

Read Also: Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్.. 7 మంది నక్సలైట్లు హతం

ఇదిలా ఉంటే, తాజాగా ఇస్కాన్ భక్తురాలైన 17 ఏళ్ల మైనర్ బాలికను అక్కడి మత ఛాందసవాదులు బెదిరించారు. దీంతో ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్ పారిపోయి వచ్చింది. రాత్రి వేళల్లో పరిగెత్తుకుంటూ భారత సరిహద్దులోకి వచ్చింది. బీఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని బాలికనున పశ్చిమ బెంగాల్‌కి అప్పగించారు. గత కొంత కాలంలో తమ కుటుంబం బెదిరింపుల్ని ఎదుర్కొంటోందని, తమ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే దేశం వదిలి పారిపోయి వచ్చినట్లు చెప్పింది. భారత్ చేరడానికి ఎంత సమయంల పడుతుందో ఖచ్చితంగా తెలియకున్నా పరిగెత్తుకుంటూ సరిహద్దు వైపు వచ్చానని చెప్పింది. బాలికను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారులు పట్టుకుని జువైనల్ కస్టడీకి అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని దినాజ్‌పూర్ జిల్లా సరిహద్దు నుంచి టీనేజ్ యువతి అక్రమంగా సరిహద్దు దాటిందని, కొంతమంది బంధువులు భారత్‌లో నివసిస్తున్నారని, వారి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పిందని పేర్కొన్నారు. బాలిక చెప్పిన విషయాలను అధికారులు పరిశోధిస్తున్నారు. సరిహద్దు దాటేందుకు ఎవరైనా సాయం చేశారా..? అనే కోణంలో విచారిస్తున్నారు. అమ్మాయికి జల్పాయిగురిలో బంధువులు ఉన్నట్లుగా తేలింది. బాలిక బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లా వాసి. కాలినడకన ఉత్తర దినాజ్‌పూర్ చోప్రా బ్లాక్‌లోని ఫతేపూర్ బోర్డర్ అవుట్‌పోస్ట్ సమీపానికి వచ్చిన సమయంలో బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు.