NTV Telugu Site icon

Satyendar Jain: జైలులో మంత్రి భోగాలు.. మరో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ

Satyender Jain

Satyender Jain

Minister Satyender Jain’s lavish meal in jail: ఢిల్లీలో బీజేేపీ వర్సెస్ ఆప్ గా మారింది రాజకీయం. ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన మరో వీడియోను రిలీజ్ చేసింది బీజేపీ. కొన్ని రోజుల క్రితం సత్యేందర్ జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసి బీజేపీ, తాగా మంత్రి విలాసవంతమైన భోజనం గురించి వీడియో విడుదల చేసింది. ఇది మరోసారి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అయింది. ఇప్పటికే మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో రచ్చరచ్చ అయింది. మొదటగా మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తిని ఫిజియోథెరపీగా పేర్కొంది ఆప్. అయితే తరువాత అతను జైలులో ఖైదీ అని తేలింది. అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్నట్లు జైలు అధికార వర్గాలు వెల్లడించాయి.

Read Also: Russia-Ukraine War: “చలి”ని ఆయుధంగా చేసుకుంటున్న రష్యా.. జెలెన్ స్కీ ఆరోపణలు

ఇక తాజాగా సత్యేందర్ జైన్ భోజనానికి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది బీజేపీ. ఇందులో అతను లగ్జరీ భోజనం చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి హెహజాద్ పూనావాలా.. వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘రేపిస్టుతో మసాజ్ చేయించుకుని, ఆయన్ను ఫిజియోథెరపిస్టు అని పిలిచిన తర్వాత.. సత్యేందర్ జైన్ విలాసవంతమైన భోజనాన్ని చూడవచ్చని, అతను సెలవులో రిసార్ట్ లో ఉన్నట్లు అటెండెంట్లు అతనికి ఆహారం అందిస్తారు’’ అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు రోజు జైలులో తనకు సరైన ఫుడ్ పెట్టడం లేదని చెప్పిన తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.

సత్యేందర్ జైన్ అంశంపై బీజేపీ, ఆప్ పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. జైలులో మంత్రి విలాసాలపై తీవ్రంగా విమర్శలు చేస్తోంది. సీఎం కేజ్రీవాల్ ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం కాంగ్రెస్ కూడా ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్పందిస్తూ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు మంత్రి మసాజ్ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మనీలాండరింగ్ ఆరోపణతో ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు.