Site icon NTV Telugu

Encounters: ఐదేళ్ళలో దేశంలో 655 ఎన్ కౌంటర్లు

గడిచిన ఐదేళ్లలో దేశంలో 655 పోలీస్‌ ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇందులో ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 191 కేసులున్నాయని ఆయన చెప్పారు. జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2022 మధ్య కాలంలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయన్నారు. 117 ఉత్తరప్రదేశ్‌లో, అసోంలో 50, జార్ఖండ్‌లో 49, ఒడిశా 36, జమ్ముకాశ్మీర్‌ 35, మహారాష్ట్ర 26 ఎన్‌కౌంటర్‌ ఘటనలు చోటుచేసుకున్నాయని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు.

https://ntvtelugu.com/chintamani-drama-ban-hearing-in-high-court/

వీటి తర్వాతి స్థానాల్లో బీహార్‌ 22 కేసులు, హర్యానాలో 15, తమిళనాడు 14, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో 13 కేసుల చొప్పున, ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయ తొమ్మిది చొప్పున, రాజస్తాన్‌, ఢిల్లీ ఎనిమిది చొప్పున ఎన్ కౌంటర్ కేసులున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

Exit mobile version