Site icon NTV Telugu

Minister Ashwini Vaishnav: ఆకతాయిలపై మంత్రి అశ్విని వైష్ణవ్ ఉక్కు పాదం.. ఫేక్ కంటెంటును అప్‌లోడ్ చేస్తే జరిమానా..

Untitled 24

Untitled 24

Minister Ashwini Vaishnav: గత దశాబ్ద కాలం తో పోల్చుకుంటే ప్రస్తుతం టెక్నాలజీ చాల అభివృద్ధి చెందింది. ఇక ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI ) తో ఉపయోగాలు ఉన్న.. కొందరు ఆకతాయిలు ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఫేక్ కంటెంట్ ను తాయారు చేస్తున్నారు. ఫోటో లను వీడియో లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖుల నుండి సాధారణ ప్రజల వరకు చాలంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళ పైన ద్రుష్టి సారించారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ నేపధ్యంలో అన్ని కంపెనీల ప్రతినిధులు, నాస్కామ్, ఏఐ రంగానికి చెందిన ప్రొఫెసర్లతో మంత్రి సమావేశం నిర్వహించారు.

Read also:Dhruva Nakshatram: సక్సస్ ఫుల్ గా ఈసారి కూడా వాయిదా అయినట్లే మాస్టారు…

ఈ సమావేశంలో డీప్‌ ఫేక్‌ కంటెంట్ ను గుర్తించడం, దానిని నిరోధించడం, అలానే రిపోర్టింగ్ మెకానిజమ్‌లను బలోపేతం చేయడం తో పాటుగా ఫేక్ కంటెంట్ ను షేర్ చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడం.. ఈ నాలుగు విషయాల పైన చర్యలు తీసుకునే అంశాలను 10 రోజుల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇక పైన ఫేక్ కంటెంట్ ను సృష్టించిన, అప్లోడ్ చేసిన, షేర్ చేసిన వ్యక్తులు శిక్షార్హులని.. అలాంటి వారిపై జరిమానా విధించబడుతుందని.. దీనికి సంబంధించిన చట్టం రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.

Exit mobile version