Site icon NTV Telugu

Doordarshan @ 63: దూరదర్శన్‌ పుట్టింది ఈ రోజే..

Dd

Dd

భారత్‌లో ఇప్పుడు రకరకాల డీటీహెచ్‌లు, శాటిలైట్ టెలివిజన్‌ వ్యవస్థలు, కేబుల్ టీవీ.. యూ ట్యూబ్‌ ఇలా ఎన్నో వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా.. ఒకప్పుడు న్యూస్‌ కానీ, ఏదైనా వినోద కార్యక్రమాలు, సినిమాలు.. ఇలా ఏదైనా దూరదర్శన్ చానల్ ఒక్కటే దిక్కు… వారాంతాల్లో వచ్చే సినిమాలు, సీరియళ్లు, చిత్రలహరి, ఇతర ప్రయోజిత కార్యక్రమాలు.. రోజు ప్రసారం అయ్యే వార్తల కోసం ప్రజలు ఎంతో ఎదరుచూస్తూ ఉండేవారు.. ఆదివారం హిందీ సినిమా, ప్రతి బుధవారం చిత్రలహరి, వ్యవసాయ కార్యక్రమాలు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు ఇలా ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి.. అప్పట్లో ఏ ఇతర ప్రసార మాద్యమాలు కూడా లేకపోవడంతో.. ఆ కార్యక్రమాలకు మంచి ఆదరణ ఉండేది.. జాతీయస్థాయిలో.. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో అభిమానులను సంపాదించుకున్న డీడీ.. ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటుంది..

దూరదర్శన్ ప్రారంభించబడింది.. భారతదేశ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ (డీడీ) తన కార్యకలాపాలను ప్రారంభించింది ఈ రోజే.. సెప్టెంబర్ 15, 1959న న్యూఢిల్లీలో ప్రారంభమైంది.. ఇది విద్య మరియు అభివృద్ధిపై అరగంట కార్యక్రమాల ప్రసారంతో ప్రారంభమైన ప్రయోగాత్మక ప్రసారం. టెలికాస్ట్‌ను ఉత్పత్తి చేయడానికి చిన్న ట్రాన్స్‌మిటర్‌తో కూడిన తాత్కాలిక స్టూడియో ఉపయోగించబడింది. ఈ పరికరాలను ప్రారంభ ప్రసారానికి ఉపయోగించే ముందు ఆల్ ఇండియా రేడియో నుండి ఇంజనీర్లు పరీక్షించారు. కాలక్రమేణా దూరదర్శన్ ఉనికి మరియు సాధారణ ప్రజలలో దృశ్యమానత పెరిగింది. అదనంగా, స్టూడియో పరికరాలు మరియు ట్రాన్స్‌మిటర్‌ల పరంగా, ఇది ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార సంస్థలలో ఒకటిగా ఉంది..

ఇక, దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. డీడీ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. సెప్టెంబర్‌ 15న వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. దూరదర్శన్‌ బృందానికి సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇది ఒక ముఖ్యమైన సందర్భం అంటూ ట్వీట్‌ చేశారు.. దశాబ్దాలుగా, ఈ ఛానెల్ భారతదేశం యొక్క మార్పులేని ప్రయాణాన్ని సంగ్రహించిందని మరియు దాని ఆర్కైవ్‌లు దేశ గొప్ప చరిత్రకు నిధి అని ఆయన రాసుకొచ్చారు.. బ్లాక్‌ అండ్‌ వైట్ కాలం నుంచి కలర్‌ వరకు.. డీడీ ప్రస్తానాన్ని చెప్పే ఓ వీడియోను కూడా షేర్‌ చేశారు. కాగా, కాల క్రమంలో రకరకాల ప్రసార మాద్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు దూరదర్శన్‌కు ఆదరణ తగ్గిపోయింది.. అంతే కాదు ఇతర ప్రసార మాద్యమాలకంటే.. ఇప్పడు సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెరిగిన విషయం తెలిసిందే. ఏది జరిగినా.. క్షణాల్లో అది సోషల్‌ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోతోంది.

Exit mobile version