Gali Janardhan Reddy: మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి సొంతూగూటికి తిరిగి వస్తున్నారు. గతంలో బీజేపీ పార్టీలో ఉన్న ఆయన కర్ణాటక రాజ్య ప్రగతిపక్ష(కేఆర్పీపీ) పేరుతో కొత్త పార్టీ స్థాపించి, గతేడాది కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే, లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరుతున్నారు. మార్చి 25న కాషాయ కండువా కప్పుకోనున్నారు. ‘‘నా మద్దతుదారులను సంప్రదించిన తర్వాత, నేను నిర్ణయం తీసుకున్నాను. రేపు ఉదయం 10 గంటలకు నేను తిరిగి బిజెపిలో చేరుతున్నాను’’ అని మీడియాకు వెళ్లడించారు.
Read Also: PoK: పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) భారత్‌లో విలీనం అవుతుంది.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బి శ్రీరాములుకు మద్దతు ఇస్తానని చెప్పారు. మాజీ మంత్రి, బీజేపీ నేతగా ఉన్న శ్రీరాములు 2023 బళ్లారి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఓడిపోయారు. బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో గాలి జనార్ధన్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సోదరులైన హరపనహళ్లీ, బళ్లారి సిటీ నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన కరుణాకర్ రెడ్డి, సోమశేఖర రెడ్డి ఓటమిలో కీలక పాత్ర పోషించారు. బళ్లారి సిటీలో తన సోదురుడికి పోటీగా గాలి జనార్ధన్ రెడ్డి తన భార్య అరుణ లక్ష్మీని పోటీకి నిలపెట్టాడు. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి విజయం సాధించారు.