Mimi Chakraborty: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత, మిమీ చక్రవర్తి తన ఎంపీ పదవకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జాదవ్‌పూర్ ఎంపీగా ఉన్న మిమీ చక్రవర్తి రాజీనామా చేస్తున్న విషయాన్ని, టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి నేరుగా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని మిమీ చెప్పినట్లు సమాచారం. అయితే, ఈ రాజీనామా విషయంపై ముఖ్యమంత్రి ఇంకా స్పందించలేదు. ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదిస్తే, తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ వద్దకు వెళ్లి సమర్పిస్తానని మిమీ చెప్పారు. ఇదే విధంగా లోక్‌సభలో రెండు స్టాడింగ్ కమిటీలకు కూడా ఆమె రాజీనామా చేశారు.
Read Also: Farmers Protest: “మోడీ గ్రాఫ్‌ని తగ్గించాల్సిన అవసరం ఉంది”.. రైతు నేత వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు..
తన నియోజకవర్గంలోని స్థానిక్ నాయకత్వం కారణంగానే ఆమె పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ స్థానం నుంచి మిమీ చక్రవర్తి విజయం సాధించారు. మిమీ బెంగాల్ చిత్రపరిశ్రమలో ఫేమస్ యాక్టర్. 1989 ఫిబ్రవరి 11న బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో జన్మించిన ఈమె 2012లో ఛాంపియన్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. 25 కంటే ఎక్కువ చిత్రాల్లో ఆమె పనిచేసింది. మిమీ పాపులారిటీని చూసి 2019లో టీఎంసీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆమెపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాని ఓడించింది. దాదాపు 2 లక్షల 95 వేల ఓట్ల భారీ తేడాతో బీజేపీ నేత అనుపమ్ హజ్రాపై ఆయన విజయం సాధించారు.
