NTV Telugu Site icon

Mahakumbh First Amrit Snan: ప్రయాగ్‌రాజ్‌లో నేడు మొదటి ‘అమృత స్నాన్’.. ఘాట్స్ వద్ద లక్షలాది భక్తులు!

Mahakumbh

Mahakumbh

Mahakumbh First Amrit Snan: ప్రపంచంలోనే మహా కుంభమేళా అతి పెద్దది. పౌష్ పూర్ణిమ పండుగ తర్వాత రోజున మకర సంక్రాంతి సందర్భంగా మొదటి ‘అమృత స్నానం’ జరగనుంది. ఈ పవిత్ర స్నానం, భక్తులను పాపాలను తొలగిస్తుందని.. అలాగే, మోక్షానికి మార్గం సుగమం చేస్తుందని నమ్ముతారు. ఇది ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగే పవిత్రమైన సమ్మేళనంలో కీలకమైన ఘట్టాన్ని సూచిస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది.

Read Also: Cyber Scams: పండుగల పేరుతో చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు.. జాగ్రత్త సుమీ

అయితే, ఇప్పటికే అమృత స్నాన్ ను నాగ సాధువులు, సాధువులు రాజ స్నానం చేశారు. ముందుగా, త్రివేణి సంగమంలో శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి, అటల్ అఖారా సాధువులు పుణ్యస్నానం చేసేశారు. ఇక, షాహీ పేరును అమృత్ స్నాన్‌గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చారు. దీంతో సాధువులు సంతోషం వ్యక్తం చేశారు. ఆచార్య మహా మండలేశ్వరుడు, మండలేశ్వరుడు మహా రథంపై కూర్చున్నారు. డోలు వాయిద్యాలతో సాధువుల రథాలను ఘాట్‌ వైపుకు కదిలించారు. మత విశ్వాసాలను అనుసరిస్తూ.. మహా కుంభమేళా నిర్వాహకులు సనాతన ధర్మానికి చెందిన 13 అఖారాలకు అమృత స్నానం ఆచారించడానికి అన్ని అఖారాలకు సమాచారం అందించారు.

Read Also: Nitish Kumar Reddy: మోకాళ్లపై తిరుమల కొండకు నితీశ్‌కుమార్ రెడ్డి..

కాగా, శ్రీ పంచాయతీ అఖారా నిర్మల్ కార్యదర్శి మహంత్ ఆచార్య దేవేంద్ర సింగ్ శాస్త్రి మాట్లాడుతూ.. అఖారాలకు చెందిన అమృత్ స్నాన్ తేదీ, క్రమం, సమయం గురించి సమాచారం అందిందన్నారు. మకర సంక్రాంతి నాడు, శ్రీ పంచాయితీ అఖారా మహానిర్వాణి అమృత స్నానాన్ని చేయనుంది. దాంతో పాటు శ్రీ శంభు పంచాయితీ అటల్ అఖారా కూడా పాల్గొంటారని చెప్పుకొచ్చారు. ఈ అఖారా ఉదయం 5.15 గంటలకు క్యాంపు నుంచి బయలుదేరి 6.15 గంటలకు ఘాట్‌కు చేరుకుంది. అఖారా స్నానం చేయడానికి 40 నిమిషాల సమయం ఇవ్వబడింది అన్నారు. ద్వితీయ స్థానంలో శ్రీతపోనిధి పంచాయతీ శ్రీనిరంజని అఖారా, శ్రీపంచాయతీ అఖారా ఆనంద్ అమృత స్నానం చేయనున్నారు.

Show comments