NTV Telugu Site icon

Millionaire Thief: మిలియనీర్‌ దొంగ.. నేపాల్‌లో హోటల్‌, యూపీలో గెస్ట్‌హౌస్‌

Millionaire Thief

Millionaire Thief

Millionaire Thief: సాధారణంగా దొంగతనాలకు పాల్పడేవారు వారు దొంగిలించిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటారు. లేదంటే వారికి ఉన్న అప్పులను తీర్చుకుంటారు. ఇల్లు గడవడానికి డబ్బులను ఖర్చు చేస్తుంటారు. కానీ దొంగిలించిన సొమ్ముతో మిలియనీర్‌గా మారిన వ్యక్తిని చూశారా? అటువంటి వారిని చూడటం అరుదు.. అలా మారడం కూడా అరుదుగానే జరుగుతుంది. కానీ ఇక్కడ దొంగలించిన సొమ్ముతో హోటల్స్, గెస్టు హౌజ్‌లను కొనుగోలు చేశాడు. తన పేరు మీద, తన భారర్య పేరు మీద ఆస్తులను కొనుగోలు చేశాడు. దొంగిలించిన సొమ్ముతో లగ్జరీగా బ్రతుకుతున్నాడు. ఆయన జీవన విధానంపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. అతనో పెద్ద మిలియనీర్‌ దొంగ అని.. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ మిలియనీర్‌ దొంగ గురించి మీరు తెలుసుకోండి..

Read also: Amrit Kalash Scheme: గుడ్ న్యూస్.. ఎస్బీఐ అమృత్ కలాశ్ స్కీం గడుపు పొడగింపు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్దార్థ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మనోజ్‌ చౌబే 1997లో ఢిల్లీకి వలస వచ్చి కీర్తినగర్‌లో ఓ క్యాంటీను ప్రారంభించాడు. క్యాంటీన్‌ నడుపుతూనే మరోవైపు దొంగతనాలు చేస్తుండే వాడు. దొంగతనాల నేపథ్యంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే తాను దొంగతనం చేసిన సొమ్ముతో నేపాల్‌లో ఓ హోటలు నిర్మించాడు. ఆ తర్వాత యూపీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తాను పార్కింగ్‌ కాంట్రాక్టు తీసుకున్నానని భార్యను నమ్మించాడు. ఏడాదిలో 8 నెలలు ఢిల్లీలోనే ఉండేవాడు. తాను చేసిన చోరీల సొమ్ముతో యూపీలో భార్య పేరిట ఒక గెస్టుహౌజ్‌ కొన్నాడు..లక్నోలో ఇల్లు కట్టాడు.. దాంతోపాటు పలు స్థిరాస్తులు కొని లీజుకు ఇచ్చాడు. తను కొన్న ఆస్తులతో అతనికి ప్రతినెలా రూ.2 లక్షలు అద్దెల రూపంలో వస్తున్నాయంటే.. అతను ఎంత సంపాదించాడు ఆలోచించుకోవచ్చు. ఇదంతా గమనించిన ఢిల్లీ పోలీసులకు మనోజ్‌ వ్యవహారంపై అనుమానం వచ్చింది. దాంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. ఇంకేముంది.. తన గుట్టంతా మనోజ్‌ బయటపెట్టాడు. దీంతో విషయం కాస్త బయటకు వచ్చింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Read also: Telangana Rains: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్

మనోజ్‌ చౌబే ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్‌కు చెందినవాడు, అతను దొంగతనం చేయడానికి ఢిల్లీకి వస్తాడని.. అతన్ని కరవాల్ నగర్‌లో అరెస్టు చేసినట్టు వాయువ్య ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ మీనా తెలిపారు. అతనికి 48 ఏళ్లని.. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారని.. ఒకరు లక్నోలో, మరొకరు ఢిల్లీలో ఉంటారని చెప్పారు. ఆయన ఇద్దరు భార్యలకు కూడా తమ భర్త దొంగ అని తెలియదని పోలీసులు తెలిపారు. అతను 200కి పైగా దొంగతనాలు చేశానని ఒప్పుకున్నాడని.. కానీ దేశ వ్యాప్తంగా దాదాపు 500 దొంగతనాల కేసుల్లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అతను 1997లో ఢిల్లీకి వచ్చి క్యాంటీన్‌లో దొంగతనానికి పాల్పడి మొదట పట్టుబడ్డాడని, పోష్ ఏరియాల్లోని ఇళ్లు అతని ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. దొంగిలించిన డబ్బుతో చౌబే నేపాల్‌లో హోటల్‌ను నిర్మించాడని, ఉత్తరప్రదేశ్‌లో తన భార్యలో ఒకరికి గెస్ట్‌హౌస్‌ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను అదే ప్రాంతంలో ఒక స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడని.. అతనికి నెలకు రూ. 2 లక్షల అద్దె వస్తుందని పోలీసులు తెలిపారు. అతనికి లక్నోలో ఇల్లు ఉందని.. అతని పిల్లలు రాజధాని నగరం ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలో చదువుతున్నారని పోలీసులు తెలిపారు.