NTV Telugu Site icon

BMW Hit-And-Run: యాక్సిడెంట్‌కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిని నిందితుడు మిహిర్‌షా..

Bmw Hit And Run Case

Bmw Hit And Run Case

BMW Hit-And-Run: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసుల సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో నిందితుడు మిహిర్ షా కారును వేగంగా నడిపి కావేరీ నక్వా అనే 45 ఏళ్ల మహిళ మరణానికి కారణమయ్యారు. చేపల వ్యాపారి అయిన కావేరీ తన భర్తతో కలిసి స్కూటర్‌పై వస్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి బాధితురాలని 1.5 కి.మీ ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఈ వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుడి తండ్రి అధికార శివసేన పార్టీకి పాల్ఘర్ జిల్లా డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. అయితే, ఈ వ్యవహారంలో శివసేన అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Read Also: Shaheen Afridi-PCB: చిక్కుల్లో పాకిస్తాన్ పేసర్ షహీన్‌ అఫ్రిది!

24 ఏళ్ల మిహిర్ షా తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్థానిక బార్‌లో 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగినట్లు పోలీసులు తెలిపారు. విపరీతంగా మద్యం తాగి కారు నడిపిన మిహిర్, తన కారు కింద బాధితురాలి శరీరం చిక్కుకున్నదనే విషయం తెలసి కూడా అలాగే డ్రైవ్ చేసినట్లు పోలీసుల వర్గాలు తెలిపాయి. స్థానికులు అరుస్తున్నప్పటికీ అతను పట్టించుకోలేదని చెప్పారు. మిహిర్ మరియు అతని డ్రైవర్ రాజర్షి బిదావత్ కొంత దూరంలో కారు ఆపి మృతదేహాన్ని పారేసే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలను మార్చడానికి ప్రయత్నించారు.ఈ ఘటనలో 72 గంటల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

అయితే, విచారణ సమయంలో తాను యాక్సిడెంట్ చేసినట్లు అంగీకరించినప్పటికీ, మద్యం సేవించినట్లు అంగీకరించలేదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో ప్రోటోకాల్ ప్రకారం తాగిన 12 గంటల్లో పరీక్షలు నిర్వహిస్తారు. నిందితుడు మూడు రోజుల తర్వాత అరెస్ట్ కావడంతో ఈ టెస్టులు పనికిరాకుండా పోయాయి. ముంబై మద్యపాన కనీస వయసు 25 ఏళ్లు గకాగా, నిందితుడికి 24 ఏళ్ల ఉన్నాయి. దీంతో బార్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మిహిర్ తనకు 27 ఏళ్లు అని తప్పుడు ఐడీ కార్డు చూపించినట్లు బార్ పేర్కొంది.