Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీతో సత్య నాదెళ్ల భేటీ

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల.. సోమవారం ప్రధాని మోడీని కలిశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని సత్య నాదెళ్ల ప్రకటించారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి భారతీయుడు వీటి ప్రయోజనాలను పొందేందుకు వీలుగా తమ సేవలను విస్తరిస్తామన్నారు. అలాగే సత్య నాదెళ్లతో భేటీ కావడంపై ప్రధాని మోడీ స్పందించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఏఐ తదితర అంశాలపై తాము చర్చించామన్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ విస్తరణ, పెట్టుబడుల ప్రణాళిక గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Justin Trudeau: కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా.. ప్రకటించిన జస్టిన్ ట్రూడో..

 

Exit mobile version