Site icon NTV Telugu

Driverless Metro: డ్రైవర్ లేకుండానే నడవనున్న మెట్రో రైలు.. ఎక్కడో తెలుసా..?

Drive Less Metro

Drive Less Metro

డ్రైవర్ లేకుండానే మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా.. దేశ రాజధాని ఢిల్లీలోని మెజెంటా లైన్ మార్గంలో డ్రైవర్ లెస్ మెట్రో రైలు నడవనుంది. జూలై 1 నుండి ఇది ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. జూలై నెలలో మెజెంటా లైన్ లో కనపడరని డీఎంఆర్సీ (DMRC) తెలిపింది. డ్రైవర్‌లెస్ మెట్రో 2020 సంవత్సరంలో మెజెంటా లైన్‌లో దశలవారీగా ప్రారంభించారు. కాగా.. ఇప్పటికీ ఇది సాధ్యమైంది. ఢిల్లీలోని మెజెంటా లైన్‌లో నడుస్తున్న డ్రైవర్‌లెస్ మెట్రో రెండు కెమెరాల సహాయంతో నడువనుంది. ఇది కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించబడుతుంది. ఒక కెమెరా మెట్రో ట్రాక్‌పై నిఘా ఉంచగా, మరో కెమెరా ఓవర్‌హెడ్ కేబుల్‌పై నిఘా ఉంచుతుంది. అంతే కాకుండా.. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులెవరైనా.. ఎమర్జెన్సీ బటన్‌ నొక్కి మెట్రోను ఆపవచ్చు. తద్వారా.. కంట్రోల్ రూమ్ కెమెరా సహాయంతో నేరుగా ఆ ప్రయాణికుడు ఎవరో తెలిసిపోతుంది.

Indigo flight: విమానం 2 గంటలు ఆలస్యం.. ఏసీ పనిచేయక అల్లాడిపోయని ప్రయాణికులు

డ్రైవర్‌లెస్ మెట్రో ప్రయోజనాలు:
డ్రైవర్‌లెస్ మెట్రో వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా.. మానవ జోక్యం, తప్పుల సంభావ్యతను తగ్గిస్తుంది. ఇది మెట్రో కోసం కోచ్‌ల లభ్యతను పెంచడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా.. రైలు ఆపరేటర్లపై భారాన్ని తగ్గిస్తుంది. డిపోలోని స్టాబ్లింగ్ లైన్‌లో పార్కింగ్ కూడా స్వయంచాలకంగా చేయబడుతుంది. ఇది కాకుండా.. రైలులో డ్రైవర్ క్యాబిన్ లేకపోవడం వల్ల.. రైలులో ప్రయాణికుల కోసం అదనపు కోచ్‌లను కూడా ఏర్పాటు చేయవచ్చు.

2020 సంవత్సరంలో డ్రైవర్‌లెస్ రైళ్లు మొదట మెజెంటా లైన్‌లో (జనక్‌పురి వెస్ట్ నుండి బొటానికల్ గార్డెన్) ప్రారంభించారు. ఆ తరువాత.. 2021 సంవత్సరంలో పింక్ లైన్‌లో (మజ్లిస్ పార్క్ నుండి శివ విహార్ వరకు) డ్రైవర్‌లెస్ మెట్రో ప్రారంభించారు. అయితే.. ఇంతకుముందు ఆపరేటర్ రైలులో ప్రయాణీకులకు భరోసా ఇవ్వడానికి.. సహాయం చేయడానికి ఉన్నప్పటికీ, ఇప్పుడు మెట్రో పూర్తిగా మానవరహితంగా ఉంటుంది.

Exit mobile version