NTV Telugu Site icon

WhatsApp: భారతదేశంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా..? కేంద్రం కీలక ప్రకటన..

Whatsapp

Whatsapp

WhatsApp: భారతదేశంలో వాట్సాప్, మెటా సర్వీసులు నిలిచిపోతాయా..? అనే ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే ప్రభుత్వ ఆదేశాల కారణంగా భారతదేశంలో వాట్సాప్ తన సేవలను నిలిపేయాలని యోచిస్తుందా.. ? అని కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా కేంద్రాన్ని ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా రాజ్యసభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వాట్సాప్ లేదా దాని మాతృసంస్థ మెటా భారత్‌లో తమ సేవల్ని నిలిపేసే ప్రణాళికలను ప్రభుత్వానికి తెలియజేయలేదని శుక్రవారం చెప్పారు. ఇండియాలో వాట్సాప్ సేవల్ని నిలిపేసే యోచన లేదని చెప్పారు. “వాట్సాప్ లేదా మెటా అటువంటి ప్రణాళికల గురించి ప్రభుత్వానికి తెలియజేయలేదని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది” అని వైష్ణవ్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Read Also: Cars in August: మహీంద్రా థార్ 5-డోర్‌తో సహా ఆగస్టులో రాబోతున్న కార్లు ఇవే..

మెసేజ్‌ ఎన్‌క్రిప్షన్‌ని తొలగించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే భారతదేశంలో పనిచేయడాన్ని ఆపేస్తామని ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వాట్సాప్ దాని మాతృసంస్థ మెటా కొత్తగా సవరించిన ఐటీ నిబంధనలను గోప్యతా హక్కును ఉల్లంఘిస్తున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ సవాల్ చేశాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నియంత్రణలపై టంఖా అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ స్పందిస్తూ, భారత సార్వభౌమాధికారం లేదా సమగ్రత, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత, స్నేహపూర్వక సంబంధాల ప్రయోజనాల కోసం విదేశాలకు లేదా పబ్లిక్ ఆర్డర్‌తో లేదా కంప్యూటర్ రిసోర్స్‌లోని సమాచారానికి సంబంధించి పైన పేర్కొన్న నేరాలను నిరోధించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A కింద కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పారు.