NTV Telugu Site icon

Kolkata doctor case: కోల్‌కతాలో ట్రాన్స్ జెండర్స్ భారీ నిరసన.. న్యాయం చేయాలని డిమాండ్

Doctorcase

Doctorcase

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ట్రాన్స్‌జెండర్స్ కూడా రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. శనివారం వైద్యులు, నర్సులు 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేశారు. దేశ వ్యాప్తంగా వైద్య బృందాలతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు నిరసన తెలిపారు. ఇక శనివారం సాయంత్రం ఆర్‌జీ కర్ ఆస్పత్రి దగ్గరకు భారీ స్థాయిలో ట్రాన్స్‌జెండర్ చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని.. అలాగే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ లో ఉగ్రమూలాలు.. ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీకి షెల్టర్ ఇచ్చింది ఎవరు?

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఈ రిపోర్టులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. ఆమె చాలా హింసకు గురైనట్లుగా అర్ధమవుతోంది. ప్రస్తుతం కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Champai Soren: బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ ఏమన్నారంటే..!

ఇదిలా ఉంటే కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ అయ్యాయి. అంతేకాకుండా డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు మలేరియా, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ విజృంభిస్తోంది. దీంతో ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వైద్య సేవలు 24 గంటలు బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రం స్పందించింది. తక్షణమే సమ్మె విరమించాలని కోరింది. వైద్యుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. దేశంలో సీజనల్‌ వ్యాధులైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది.