Site icon NTV Telugu

PM Modi: మోడీ సభకు బలవంతంగా ప్రజల్ని తరలించారు.. కాశ్మీర్ నేతల ఆరోపణలు..

Pm Modi

Pm Modi

PM Modi: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కాశ్మీర్ లోయలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పర్యటించారు. ప్రధాని ‘విక్షిత్ భారత్ విక్షిత్ జమ్మూకాశ్మీ్ర్’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంకి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, ఈ సభకు ప్రజల్ని బలవంతంగా తరలించారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.

Read Also: Bengaluru Blast: పేలుడు తర్వాత దుస్తులు మార్చుకుని బస్సులో ప్రయాణించిన నిందితుడు..

‘‘బలవంతంగా సమీకరించారు, బుద్గాం బస్‌స్టాండ్‌లో ఉదయం 5 గంటలకు చల్లని వాతావరణంలో ప్రజలు తరలించబడ్డారు’’ అని ఎక్స్ వేదిక ముఫ్తీ ట్వీట్ చేశారు. 2019 తర్వాత అంతా బాగానే ఉందని చెప్పడానికి ఉద్యోగులను బలవంతంగా సమీకరించారని ఆరోపించారు. బుద్గామ్‌లో ప్రజలు బస్సులు ఎక్కుతున్న వీడియోలను ఆమె షేర్ చేశారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి ప్రధానులు సందర్శించిన దానితో పోలిస్తే పీఎం మోడీ ర్యాలీ విరుద్ధంగా ఉందని అన్నారు.

నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ కార్యక్రమానికి హాజరుకాని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని బెదిరించారని నియంతృత్వ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మోడీ సభకు జనాన్ని అందించేందుకు అన్ని విధాల సహకరించిందని అన్నారు. పురుషులు, మహిళలు గడ్డకట్టే చలిలో ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య సమావేశ వేదిక వద్దకు తీసుకుని వెళ్లారని ఆరోపించారు.

Exit mobile version