Mega Trade Deal: ఈయూ, యూఎస్ తర్వాత.. మరో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతున్న భారత్..

  • మరో మెగా ఫ్రీ ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతున్న భారత్..
  • ఇప్పటికే ఈయూ, అమెరికాలతో ఒప్పందాలు..
  • ఇప్పుడు గల్ఫ్ దేశాలతో వాణిజ్య చర్చలు మొదలు..
Fta

Fta

Mega Trade Deal: భారత్ మరో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్(ఈయూ), అమెరికాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(FTA) కుదుర్చుకుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో తన మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కో-ఆపరేటివ్ కౌన్సిల్(GCC)‌తో వాణిజ్య ఒప్పందానికి భారత్ చర్చలకు సిద్ధమైంది. ఇది భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈయూ, ఆసియాన్, అమెరికా, చైనాల కన్నా పెద్ద మార్కెట్.

Read Also: YS Jagan: కళ్లు మూసుకుని తెరిస్తే రెండేళ్లు గడిచాయి.. మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే..

204-25లో భారత్,GCCల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $179 బిలియన్లకు చేరింది. ముఖ్యంగా యూఏఈ, ఒమాన్ దేశాలతో ఉన్న CEPA ఒప్పందాల కారణంగా భారత్ నుంచి రత్నాలు, మెటల్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ వంటి ఎగుమతులు పెరిగాయి. ఇప్పుడు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఒమాన్, బహ్రెయిన్ వంటి ఆరు దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చలు ప్రారంభించింది. భారత్ ఇప్పటికే యూఏఈతో 2022 నుంచి ట్రేడ్ డీల్‌ను అమలు చేస్తోంది. 2025 డిసెంబర్‌లో ఒమాన్‌తో ఒప్పందం కుదిరింది.

మిగిలిన దేశాలతో ఒప్పందాలు కుదిరితే భారత ఉత్పత్తులకు ఎలాంటి డ్యూటీలు, టారిఫ్‌లు ఉండవు. భారతీయ ఎగుమతులకు భారీ మార్కెట్ లభించినట్లవుతుంది. గల్ఫ్ దేశాలకు భారత్ ఆహార భద్రతను ఇస్తే, గల్ఫ్ నుంచి భారత్‌కు ఇంధన భద్రత లభిస్తుంది. గల్ఫ్‌లో ఉంటున్న భారతీయులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. భారత్-GCC మధ్య ఒప్పందం కోసం చర్చలు అధికారికంగా ప్రారంభించేందుకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(ToR) పై సంతకం చేశాయి.