Uttar Pradesh: పెళ్లిలో కోటి రూపాయల నోట్ల దండలు.. ఇద్దరు వరులకు బావ అదిరిపోయే గిఫ్ట్!

Up

Up

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ మథురలో జరిగిన ఓ వివాహ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు వరుల మెడలో ఏకంగా రూ. 1 కోటి విలువైన నగదు దండను ధరించడం చూసి పెళ్లికి వచ్చిన అతిథులు, స్థానికులు షాక్ అయ్యారు. ఒక్కో వరుడి మెడలో రూ. 1 కోటి విలువైన దండను కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మథుర జిల్లాలోని సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా ఫోండా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరులు ప్రశాంత్, కన్హా రాఘవ్‌లకు ముద్‌సేరస్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులో నిశ్చయమైంది. శనివారం సంప్రదాయ వివాహ వేడుకల్లో ఇద్దరు వరులకు బావ అయిన యోగేష్ కుమార్ అలియాస్ భురా ఠాకూర్ రూ. 500 నోట్లతో దండను బహూకరించారు. ఈ దండ ఒక్కొక్కటి సుమారు 100 అడుగుల పొడవు ఉంది. ఒక్కో దండలో దాదాపు రూ. 1 కోటి విలువైన 500 నోట్లు ఉన్నాయి. ఈ దండను చూసేందుకు స్థానికులు బారులు తీరారు.