Site icon NTV Telugu

Kissing Incident: రోడ్డుపై వెళ్తున్న బాలికకు బలవంతంగా ముద్దు.. వీడియో వైరల్..

Uttar Pradesh

Uttar Pradesh

Kissing Incident: ఉత్తరప్రదేశ్ మథుర జిల్లాలో జరిగిన కిస్సింగ్ ఘటనపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. పగటిపూట రోడ్డుపై వెళ్తున్న 15 ఏళ్ల బాలికకు ఓ వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఓ పిల్లాడిని ఎత్తుకుని వెళ్తున్న బాలికను ఓ వ్యక్తి వెంబడించి, బలవంతంగా ముద్దుపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటన మథుర జిల్లా గోవర్ధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Read Also: Iran: ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ భయపడుతోంది..

పశ్చిమ బెంగాల్‌కి చెందిన బాధిత బాలిక కుటుంబంతో కలిసి మథుర సందర్శించేందుకు వచ్చింది. బాలిక తన చేతిలో బిడ్డను ఎత్తుకుని వెళ్తున్న సమయంలో ఆమెను ఫాలో అయిన వ్యక్తి ఆమెపై అడ్డగించి ముద్దు పెట్టాడు. బాలిక అరుపులతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించి క్షమించాల్సిందిగా కోరాడు. స్థానిక పంచాయతీ సమావేశంలో 10 చెప్పు దెబ్బలతో శిక్షించాలని ఆదేశించారు. ఈ ఘటన తర్వాత బాలిక తన స్వరాష్ట్రం బెంగాల్‌కి వెళ్లింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. బాలికపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి చెప్పుదెబ్బలతో న్యాయం చేయాలనుకున్న పంచాయతీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version