Allahabad High Court: తనకు ఇష్టం లేదన్న భర్త తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ హై కోర్టు ను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు మీద విచారణ జరిపిన హై కోర్టు సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. వివరాలలోకి వెళ్తే.. ఓ వివాహిత తన భర్త పైన కోర్టులో వేసిన ఫిర్యాదు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు ఇష్టం లేదని చెప్పిన తన భర్త లైంగికంగా కలవడానికి బలవంతం చేసాడని.. తాను సహకరించలేదని హింసించాడని ఓ భార్య అలహాబాద్ హైకోర్టు లో ఫిటీషన్ దాఖలు చేసింది. కాగా ఈ ఫిటీషన్ పైన విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. వివాహంతోనే భార్యభర్తల మధ్య లైంగిక చర్య హక్కుగా వస్తుందని.. ఇందులో బలవంతం చేయడం నేరం కాబోదని.. ఎలాంటి క్రిమినల్ పెనాల్టీ ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
Read also:Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్.. ఖరారు చేసిన బీజేపీ
అయితే భార్యకు 18 ఏళ్లు నిండి ఉండాలని.. అలా భార్యకు 18 ఏళ్లు నిండితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఐపీసీ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ.. అసహజ నేరారోపణలు ఎదుర్కుంటున్నభర్తను నిర్దోషిగా పరిగణిస్తూ జస్టిస్ రామ్‌మనోహర్ నారాయణమిశ్రా సంచలనాత్మక తీర్పును ఇచ్చారు. కాగా బాధితుడితోపాటు అతని బంధువులు ఆమెను గాయపరచడం అలానే క్రూరంగా వ్యవహరించారన్న అభియోగాల్లో మాత్రం భర్తను దోషిగా తేల్చింది. అయితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో అలహాబాద్, మధ్యప్రదేశ్ హైకోర్టుల తాజా తీర్పులు ఆసక్తికరంగా మారాయి.