Site icon NTV Telugu

వంతెనను పేల్చేసిన మావోలు

జార్ఖండ్‌లో మావోయిస్టులు వ‌రుస‌గా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెన‌ను మావోయిస్టులు తెల్లవారు జామున పేల్చేశారు. అంతేకాకుండా, జిల్లాలోని ఒక మొబైల్ ఫోన్ టవర్‌ను పేల్చేశారు. మరో టవర్‌కు నిప్పుపెట్టి క‌ల‌క‌లం రేపారు. మావోయిస్టుల నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా మావోలు ప్రస్తుతం రెసిస్టెన్స్ వీక్‌ను పాటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే విధ్వంసాల‌కు తెగ‌బ‌డుతున్నారు. మావోయిస్టుల చర్యల నేపథ్యంలో వారి కోసం ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఏజెన్సీలోని గ్రామాలను సైతం అప్రమత్తం చేశామని వెల్లడించారు.

Exit mobile version