Site icon NTV Telugu

Maoist Letter: శాంతి చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధమే.. ప్రధాని రెడీయా లేదో స్పష్టం చేయాలి.. మావోయిస్టుల లేఖ..

Untitled 1

Untitled 1

Maoist Letter: ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం.. అయితే, భారత్-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్‌ కగార్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది ప్రభుత్వం.. ఇక, తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ఎప్పుటి నుంచో చెబుతూ ఉన్నారు.. మరోవైపు.. శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఆంటూ పౌర హక్కుల సంఘాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు..

Read Also: Aadi Srinivas : అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.. అందుకే..

శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్.. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మరియు ఆపరేషన్ కగార్‌ను ఆపడానికి ముందుకు రండి అంటూ పిలుపునిచ్చారు.. ఇక, శాంతి చర్చలు జరపడానికి.. ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ముందుకు రండి.. అంటూ పౌర హక్కుల ప్రజాస్వామ్యవాదులకు తన లేఖ ద్వారా పిలుపునిచ్చారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్..

Exit mobile version