Site icon NTV Telugu

తమిళనాడులో భారీ వర్షాలు.. నీట మునిగిన పలు ప్రాంతాలు..

గత నెల క్రితం వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై, కాంచీపురం తిరువళ్లూరు, చింగ్లెపేట్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో చైన్నైలో ఫ్లడ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సీఎం స్టాలిన్‌ సందర్శించారు.

అంతేకాకుండా వర్షాలు, సహాయక చర్యలపై సీఎం స్టాలిన్ సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్టాలిన్‌ అధికారులకు సూచించారు. సహాయం కావాల్సిన ఎవరైనా ఫ్లడ్‌ కంట్రోల్‌ రూంను సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

Exit mobile version