Manipur Violence: మణిపూర్‌లో అరాచకాలెన్నో.. ఒక్కొక్కటిగా బయటికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ గత రెండున్నర నెలలుగా హింసతో అట్టడుకుతోంది. మే 3న ప్రారంభమైన రావణకాష్టం ఇంకా రాజుతూనే ఉంది. రెండున్నర నెలల్లో ఎనో్న హింసాత్మక సంఘటనలు.. అమానవీయ ఘటనలో చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ను నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు గానీ, ఘటనలు గానీ హింస గానీ బయటి ప్రపంచానికి తెలియడం లేదు. ఇప్పటి వరకు జరిగిన హింసాత్మక సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మణిపూర్ ప్రజలు గడిచిన రెండున్నర నెలలుగా కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోందను కుంటున్న తరుణంలో అల్లర్ల సమయంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Read also: Seema Haider: ఐఎస్ఐకి సీమా హైదర్ భయపడిందా.. భారత్‌లో ఆశ్రయానికి సచిన్‌ను పావుగా వాడుతోందా?
Also Read
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మరువక ముందే ఒక మహిళను ఇంట్లోనే పెట్టి సజీవ దహనం చేసిన మరో ఘటన సెరౌ పోలీస్ స్టేషన్లో నమోదైంది. మే 28న కక్చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామంలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడి భార్య ఐబెతొంబి(80)ను అల్లర్ల సమయంలో ఇంట్లోనే బంధించి ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో బాధితురాలు ఎటూ తప్పించుకోలేక అగ్నికి దహనమైంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మనవడు ప్రేమకంఠ(22) పై సాయుధులైన నిరసనకారులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అతడి చేతుల్లోకి తొడభాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాడి అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చగా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆరోజున ప్రమాదాన్ని పసిగట్టిన మృతురాలు కొద్దిసేపైన తర్వాత తిరిగి రండని చెప్పి ఇంట్లో వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పి తాను మాత్రం ఇంట్లోనే ఉండిపోయి అగ్నికి ఆహుతైందని చెప్పుకొచ్చాడు మనవడు ప్రేమకంఠ. రెండు నెలల తర్వాత తిరిగొచ్చిన అతను శిధిలమైన ఇంటి నుండి జ్ఞాపకాలను తన వెంట తీసుకుని వెళ్ళాడు. వాటిలో మృతురాలి భర్త ఎస్. చురాచంద్ సింగ్ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా గౌరవ పురస్కారాన్ని స్వీకరించిన ఫోటో ఫ్రేము కూడా ఉంది. మణిపూర్ అల్లర్లలో అత్యధికంగా నష్టపోయిన గ్రామాల్లో సెరౌ గ్రామం కూడా ఒకటి. రాజధాని ఇంఫాల్‌కి 45 కి.మీ దూరంలో ఉండే ఈ ప్రాంతం హింసాకాండలో బాగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సగం కాలిపోయిన ఇళ్ళు.. తూటాల రంధ్రాలతో నిండిన గోడలు దర్శనమిస్తున్నాయి. కుకీ-మైతీ ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ అక్కడే పడి ఉన్నట్లు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ గ్రామం నుంచి ప్రజలు ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయారు. ప్రస్తుతం ఆ గ్రామం నిర్మానుష్యంగా మారిపోయింది.
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!