Site icon NTV Telugu

Manu bhaker: స్టార్ షూటర్‌‌కు కొత్త తలనొప్పి.. ఫ్యాషన్ షో‌పై నెగిటివ్ కామెంట్స్

Manubhaker

Manubhaker

భారత స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆటకు కొంత సమయం విరామం ప్రకటించింది. ఈ సమయంలో ఆయా ఈవెంట్స్‌ల్లో పాల్గొంటోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్‌లో పాల్గొని ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోసింది. ర్యాంప్‌పై వాక్‌ చేస్తూ ఆయా హావభావాలు పండించింది. ఇక తనకు అలవాటైన భంగిమలో ఎయిర్ గన్ రూపంలో స్టైల్ ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ర్యాంప్‌పై ఆమె ప్రదర్శించిన హావభావాలపై కొందరు నెటిటివ్ కామెంట్స్ చేయగా.. మరికొందరు అనుకూలంగా స్పందించారు. దీంతో మను భాకర్ స్పందిస్తూ.. ద్వేషించేవారు ద్వేషిస్తారంటూ కొట్టిపారేసింది. కొంత మంది మంచి అబ్బాయిలు ఉంటారు.. ఇంకొందరు ద్వేషించేవారు కూడా ఉంటారని పేర్కొంది.

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు కాంస్య పతకాలను సాధించింది. ప్రస్తుతం ఆటకు విరామం తీసుకుంటుంది. నవంబర్‌లో తిరిగి శిక్షణ ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. అలాగే వచ్చే ఏడాది షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక ర్యాంప్ వాక్‌పై కామెంట్స్ చేసే వారు ద్వేషించేవారు అలానే కామెంట్లు చేస్తారంటూ మను భాకర్ కొట్టిపారేశారు.

Exit mobile version