Site icon NTV Telugu

Man Hand Chopped: వ్యక్తి చేయి నరికి, ఎత్తుకెళ్లిన దుండగులు..

Haryana

Haryana

Man’s Hand Chopped Off In Haryana: హర్యానాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై దాడిచేసి చేయిని నరికేశారు. అంతటితో ఆగకుండా నరికిన చేయిని తీసుకుని వెళ్లారు దుండగులు. ఈ ఘటనలో బాధితులుడు తీవ్రగాయాలపాలై చావుబతుకుల మధ్య ఉన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ఘటన జరిగింది. జగ్ను అనే వ్యక్తిపై సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుక్షేత్ర హవేలీలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని.. లోక్‌నాయక్‌ జై ప్రకాష్‌ నారాయణ్‌ ఆసుపత్రి చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌కు అమెరికా భారీ ఆర్థిక సాయం

పది నుంచి పన్నెండు మంది వ్యక్తులు ముఖాలకు మాస్కులు వేసుకుని కురుక్షేత్ర హవేలీలోకి ప్రవేశించి, బాధితుడు జుగ్నుపై దాడి చేశారు. చేయిని నరికేశారు. అయితే ఈ ఘటన వెనక కారణాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నట్లు స్థానిక డీఎస్పీ రామ్ దత్ నైన్ తెలిపారు. బాధితుడి వాగ్మూంలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకున్నారు. సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితుడు కురుక్షేత్ర హవేలీ వెలుపల కూర్చుని ఉండగా 10-12 మంది వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Exit mobile version