Site icon NTV Telugu

Manisha Koirala: నేపాల్ ‘‘హిందూ దేశం’’గా ఉన్నప్పుడే బాగుండేది..

Manisha Koirala

Manisha Koirala

Manisha Koirala: నేపాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు జరిపింది. ఈ ఆందోళనలతో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ హింసాత్మక ఆందోళనల్లో 50 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం, నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట్లాడిన పాత వీడియో వైరల్‌గా మారింది.

Read Also: CHINA: మేము యుద్ధాలకు సృష్టించం, పాల్గొనం.. ట్రంప్‌కి చైనా కౌంటర్..

నేపాల్‌ను హిందూ దేశంగా పేర్కొంటూ, లౌకిక వాదాన్ని విమర్శిస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ‘నేపాల్ చారిత్రాత్మకంగా హిందూ దేశం, ఇది నేపాల్ గుర్తింపులో అంతర్భాగం’’ అని ఆమె అన్నారు. ఈ వీడియోను ఎక్స్‌లో ఒక యూజర్ షేర్ చేస్తూ.. మనీషా కోయిరాలా కొంతకాలం క్రితం నేపాల్ గురించి ఇలా చెప్పారు అనే క్యాప్షన్ ఇచ్చారు.

‘‘మనది హిందూ దేశం. మన అత్యున్నత గుర్తింపు ఏంటంటే మనం హిందువులం. మన దేశంలో మతం కోసం ఎప్పుడూ గొడవలు జరగలేదు. యుద్ధం లేదు, హత్యలు లేవు, గొడవలు లేవు. మనది శాంతియుత హిందూ దేశం. ఇక్కడ ఎలాంటి ఘర్షణలు లేవు. హిందూ దేశాన్ని ఎందుకు తొలగించారు..? నా ఉద్దేశంలో ఇదంతా కుట్రలా అనిపిస్తోంది. ఐక్యత దీనిని పూర్తిగా తొలగిస్తుంది’’ అని ఆమె అన్నారు. నవంబర్ 2022లో ఓ టీవీ ఛానెల్‌కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version