NTV Telugu Site icon

Delhi Liquor Case: లిక్కర్ కేసులో సీబీఐ విచారణ.. మనీష్ సిసోడియా “జైల్” ట్వీట్

Manish Sisodia

Manish Sisodia

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో నమోదు అయిన ఛార్జీషీట్ లో సిసోడియా పేరు కూడా ఉంది. అయితే గత ఆదివారమే సీబీఐ ముందు సిసోడియా హాజరుకావాాల్సి ఉన్నా, విచారణకు మరింత సమయం కోరారు. తాను బడ్జెట్ సిద్ధం చేసే పనిలో ఉన్నానని అందుకే మరింత గడువు కావాలని కోరారు. దీంతో ఈ రోజు విచారణకు హాజరుకాబోతున్నారు.

Read Also: Pakistan: పాక్ తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్‌పై కాల్పులు..

ఇదిలా ఉంటే ఈ కేసులో మరికొన్ని గంటల్లో సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. దీనికి ముందు సిసోడియా జైలు జీవితంపై ట్వీట్ చేశారు. ‘‘ఈరోజు మళ్లీ సీబీఐకి వెళ్తే విచారణకు పూర్తిగా సహకరిస్తా.. లక్షలాది మంది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశప్రజల ఆశీస్సులు నా వెంట ఉన్నాయి.. కొన్ని నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చినా పట్టించుకోను.. భగత్ సింగ్ అనుచరుడు, దేశం కోసం భగత్ సింగ్ ఉరి వేసుకుని చనిపోయాడు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్లడం పెద్ద విషయం కాదు’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకువచ్చని లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు సిసోడియాపై ఉన్నాయి. దీనిపై సీబీఐతో పాటు ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఈ కేసు లింకులు తెలుగు రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నాయి. గోవా ఎన్నికల సమయంలో ప్రచారానికి ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన రూ. 100 కోట్లను వినియోగించుకుందనే అభియోగాలు కూడా ఉన్నాయి.