Site icon NTV Telugu

Manish Sisodia: కేజ్రీవాల్ ఇంట్లో ఉద్వేగ పరిస్థితులు.. సిసోడియాను హత్తుకున్న కుటుంబ సభ్యులు

Manishsisodiaexcm

Manishsisodiaexcm

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటికి రాగానే ఒక విధమైన ఉద్వేగ వాతావరణం చోటుచేసుకుంది. దాదాపు 17 నెలల తర్వాత సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదల కాగానే కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. అక్కడ కేజ్రీవాల్ తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు. అనంతరం సునీతా కేజ్రీవాల్‌, పిల్లల్ని కలిశారు. ఈ సందర్భంగా ఒక విధమైన దు:ఖ భరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆనందభాష్పాలతో అందరూ ఉప్పొంగిపోయారు. సిసోడియాను చూడగానే సంతోషంతో పొంగిపోయారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 17 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనకు ఆప్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. గతేడాది ఫిబ్రవరిలో లిక్కర్ కేసులో సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి. భార్యకు ఆరోగ్యం బాగోలేకపోయినా బెయిల్ దొరలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు ఆయనకు విముక్తి లభించింది.

 

Exit mobile version