ఢిల్లీ లిక్కర్ కేసు ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారిస్తున్నారు. న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ గతంలో పలుమార్లు బీజేపీ అనుబంధ సంస్థల కార్యక్రమాల్లో పాల్గొన్నారని.. ఆమెతో న్యాయం జరుగుతుందని నమ్మకం కలగడం లేదని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణ నుంచి ఆమెను తప్పించాలని పిటిషన్ వేయగా.. న్యాయస్థానం కొట్టేసింది.
ఈ నేపథ్యంలో సోమవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కేజ్రీవాల్ లేఖ రాశారు. వ్యక్తిగతంగా గానీ న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని లేఖలో పేర్కొన్నారు. ‘‘జస్టిస్ స్వర్ణకాంత నుంచి న్యాయం లభిస్తుందన్న నా ఆశలు ఆవిరయ్యాయి. అందువల్ల నేను గాంధీజీ సత్యాగ్రహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. నా మనస్సాక్షి ఆధారంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు ఇస్తే.. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కును నేను కలిగి ఉంటాను.’’ అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తాజాగా కేజ్రీవాల్ బాటలోనే మనీష్ సిసోడియా వెళ్తున్నారు. తాను కూడా జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఎదుట హాజరుకాబోనని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా గానీ న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని లేఖలో పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని.. మిగిలింది సత్యాగ్రహం మాత్రమేనని లేఖలో తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేసింది. అనంతరం 2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. అనూహ్యంగా ఈ కేసును గత ఫిబ్రవరి 27, 2026న ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు. ఆమె ఆర్ఎస్ఎస్ సానుభూతిపరురాలని.. అలాగైతే ఈ కేసులో తమకు న్యాయం జరగదని.. విచారణ నుంచి తప్పించాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 20న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అయితే ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాబోనని తేల్చి చెబుతూ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లేఖ రాశారు.
"No lawyer will appear, no hope for justice, only Satyagraha left'': Manish Sisodia writes to Delhi HC
Read @ANI Story | https://t.co/LUlpy8ipkM#ManishSisodia #DelhiHC #excisepolicy pic.twitter.com/hkLkRxE6NS
— ANI Digital (@ani_digital) April 28, 2026
