Site icon NTV Telugu

Tripura: త్రిపుర సీఎంగా మాణిక్ సాహా.. ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని..

Manik Saha

Manik Saha

Tripura: త్రిపురలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా నేడు మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీని వరసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావడంతో మాణిక్ సాహా కీలకంగా పనిచేశారు. దంతవైద్యుడు, రాజకీయనాయకుడిగా సాహాకు క్లీన్ ఇమేజ్ ఉంది. అగర్తలా వివేకానంద మైదాన్ లో ప్రమాణస్వీకారం జరిగింది. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read Also: Russia-Ukraine War: బఖ్‌ముత్ రష్యా సొంతం అయితే అంతే సంగతులు.. జెలన్ స్కీ భయం..

మాణిక్ సాహా 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2020లో రాష్ట్ర పార్టీ చీఫ్ గా నియమితుడయ్యారు. మార్చి 2022లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే గతేడాది త్రిపుర సీఎంగా ఉన్న బిప్లవ్ దేవ్ స్థానంలో మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా నియమించింది బీజేపీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాల్లో తన మిత్ర పక్షం ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) పార్టీతో కలిసి 32 స్థానాల్లో గెలిచింది. ఇందులో బీజేపీనే 31 స్థానాలను కైవసం చేసుకుంది.

త్రిపురలో బీజేపీ 32 సీట్లు మరియు దాదాపు 39 శాతం ఓట్లతో పూర్తి మెజారిటీని గెలుచుకోవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తిప్ర మోత పార్టీ 13 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది.మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 11 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సాహాను సోమవారం గవర్నర్ సత్యదేశ్ నారాయన్ ఆర్య పిలిచారు. అంతకుముందు రోజు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహిచారు మాణిక్ సహా. సభ్యులంతా మాణిక్ సాహాను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Exit mobile version