NTV Telugu Site icon

Mangoes stolen: ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు..కట్ చేస్తే కిలో రూ.2.5 లక్షల విలువైన మామిడి పండ్లు చోరీ

Mangoes

Mangoes

Mangoes stolen: ఒక్కోసారి ఆన్ లైన్ పోస్టులతో ఫేమస్ అవ్వడమే కాదు. దొంగతనాలు కూడా జరుగుతాయని ఈ ఘటన నిరూపించింది. ఏకంగా రైతు లక్షల్లో నష్టపోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ లో కిలోకి రూ.2.5 లక్షల విలువైన మామిడి పండ్లు దొంగతనానికి గురయ్యాయి. తోటలోకి ప్రవేశించిన దొంగలు తెల్లారే సరికి మామిడిని చోరీ చేశారు. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడా జిల్లాలో జరిగింది.

Read Also: Telangana: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యాదినోత్సవం.. రాగిజావ పంపిణీతో బడులు ప్రారంభం

వివరాాల్లోకి వెళ్తే.. తన తోటలో కాస్తున్న మామిడికి అంతర్జాతీయ మార్కెట్ లో కిలోకు రూ. 2.5 లక్షల ధర ఉందని రైతు లక్ష్మీనారాయణ ఉబ్బితబ్బిబ్బు అవుతూ.. తన తోటలోని మామిడి కాయలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన పొలంలో దాదాపుగా 38 రకాల మామిడి పండ్లను సాగు చేశాడు. తన తోటలోని మామిడి ధరను తెలియజేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ వార్తను ప్రపంచంలో పంచుకోవడానికి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఇదిలా ఉంటే అతను పోస్ట్ చేసిన ఒక రోజు తర్వాత తోటనుంచి విలువైన నాలుగు మామిడి కాయలు చోరీకి గురయ్యాయి. దీంతో లక్ష్మీనారాయణ సోషల్ మీడియా పోస్టు కారణంగానే తన ఆదాయాన్ని కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో తన చుట్టుపక్కల ఉండే స్థానికులను నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.

Show comments