Site icon NTV Telugu

Delhi: పార్లమెంట్ దగ్గర ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి

Delhisucide

Delhisucide

క్రిస్మస్ రోజున పార్లమెంట్ భవనం సమీపంలో ఆత్మాహత్యాయత్నం చేసిన 26 ఏళ్ల జితేంద్ర అనే యువకుడు ప్రాణాలు వదిలాడు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఆర్ఎమ్‌ఎల్ ఆస్పత్రిలో చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. జితేంద్ర పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. లోతైన గాయాలు కారణంగా చనిపోయాడు.

ఇది కూడా చదవండి: Duty Free Liquor: బ్లాక్ దందా… డ్యూటీ ఫ్రీ లిక్కర్‌ను బ్లాక్‌లో అమ్ముతున్న పోలీసులు

జితేంద్ర శరీరం 95 శాతం మేర కాలిపోయిందని వైద్యులు తెలిపారు. అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. అలాగే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడడంతో శుక్రవారం తెల్లవారుజామున 2:23 గంటలకు జిత్రేంద్ర చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. జితేంద్ర ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో నివాసం ఉంటాడు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. మరొక కుటుంబంతో తగాదాలు ఉన్నాయి. దాడులకు సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. ఇరు కుటుంబాల గొడవల నేపథ్యంలో జితేంద్ర ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరు కుటుంబాల వైర్యంతో మానసికంగా కృంగిపోయాడని.. ఈ ఘటన అతన్ని ఎంతగానో బాధించిందని పోలీస్ అధికారి తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని అతని కుటుంబానికి అందజేశారు.

ఇది కూడా చదవండి: IND Women vs WI Women: దీప్తి శర్మ ఆల్‌రౌండర్ షో.. వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

Exit mobile version