Site icon NTV Telugu

Man Upset of His Wife: భార్య కొడుతుందని చెట్టెక్కిన భర్త.. నెలరోజులుగా అక్కడే!

Man Upset Of His Wife

Man Upset Of His Wife

భార్య భర్తల గొడవలు ఎక్కడి దారి తీస్తున్నాయో ఎవరికి అర్థంకావు. కొన్ని అక్రమ సంబంధానికి తతావు లేపుతుంటే.. మరొకొన్ని ఒకరిపై ఒకరు దాడికి పాల్పడేలా ఘటనలు చవిచూస్తున్నాయి. దాంపత్య జీవితం ఏమో గానీ దారి మాత్రం మళ్లుతుందనే చెప్పాలి. దాంపత్య జీవితంలో ఎప్పుడు ఎలాంటి గొడవలు వస్తాయో చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానై ఏకంగా సముద్రాన్ని ఈదలేని సంసారంలా మారుతున్నాయి. నిత్యం గొండవలతో విసిగి పోయిన భర్త విచిత్రమైన పనిచేశాడు. తన అర్థాంగితో ఒక పడలేను అనుకున్నాడో ఏమో గానీ ఏకంగా 80 అడుగుల తాటిచెట్టు పై ఎక్కి ఒకరోజు రోజు రెండు రోజులు కాదండీ బాబు ఏకంగా నెల రోజులుగా అక్కడే జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మావ్ జిల్లా కోపగంజ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లో వెళితే.. నగరానికి చెందిన రామ్ ప్రవేశ్ అనే నలభై రెండేళ్ల వ్యక్తి. తన భార్య తరుచూ గొడవ పడుతుండటంతో.. విసుగు చెందిన రామ్‌ కు విచిత్ర మైన ఆలోచన వచ్చింది. కోపంతో ఏకంగా తాటి చెట్టును ఎంచుకున్నాడు. 80 అడుగుల తాడి చెట్టుపై ఎక్కి అక్కడే వుండి పోయాడు. కుటుంబ సభ్యులు ఊరంతా గాలించిన రామ్‌ ప్రవేశ్‌ జాడ దొరకలేదు. చివరకు స్థానికులు రామ్‌ ప్రవేశ్‌ను తాటిచెట్టుపై గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని రామ్‌ ను కొందకు దిగమని కోరినా రామ్ దిగకపోవడంతో.. విసుగు చెందిన కుటుంబ సభ్యులు వదిలేసారు. కానీ అతనికి చెట్టుపైనే ఆహారం అందిస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అర్థరాత్రి చెట్టు దిగేవారని స్థానికుల చెబుతున్నారు.

అయితే, రామ్‌ ఉంటున్న తాటి చెట్టు పక్కనే చాలా ఇళ్లు ఉన్నాయి. వారి ఇళ్లలో.. ఏమి చేస్తున్నారో అతను గమనిస్తున్నాడని, ఇది తమ గోప్యతకు భంగం కలిగిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా.. పలువురు మహిళలు కూడా అతనిపై ఫిర్యాదు చేశారు. స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్టుపై వున్న రామ్‌ప్రవేశ్‌ను కిందకు దిగాలని కోరారు. దానికి రామ్‌ ప్రవేశ్‌ ససేమిరా అన్నాడు. ఇంకా ఎన్నాళ్లు చెట్టుమీద రామ్‌ ప్రవేశ్‌ వుండనున్నాడో ఏమో. అయితే స్థానికులు చెప్పినట్లుగానే ఇరుగుపొరుగు వారు ఏం చేస్తున్నారో అనే విధంగా రామ్‌ప్రవేశ్‌ గమనిస్తున్నాడా.. లేక నిజంగానే భార్యతో భరించలేక చెట్టు మీదే వున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరైనా సరే ఒకరోజు, రెండు రోజుల మాత్రమే వుండగలరు. లేదా ప్రకృతి ప్రియులైతే 10రోజుల వుండగలరు కానీ ఏకంగా నెల రోజుల నుంచి ఆహారం కూడా అక్కడే వుండి తిని రాత్రి పూట మాత్రమే దిగడం ఏంటిని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరి పోలీసులు రామ్‌ ప్రవేశ్ ను కిందికి దించుతారా? లేదా? అన్న దానిపై ప్రశ్నార్థకంగా మారింది.
Gold Price Today: పసిడి ప్రేమికులకు శుభవార్త.. పడిపోయిన గోల్డ్‌ రేట్..

Exit mobile version