Site icon NTV Telugu

Bengaluru: పెళ్లికి నిరాకరించిందని యువతిపై యాసిడ్ దాడి

1052379 Acid Attack

1052379 Acid Attack

మహిళలపై దాడులు జరగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు. మరికొంత మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలు శిక్షిస్తాయనే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడి చేశారు. బాధితురాలు, నిందితుడికి సహోద్యోగి. అతన్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అప్పటికే వివాహం అయి ఓ బిడ్డ ఉన్నా.. తనను వివాహం చేసుకోవాలని వేధిస్తుండే వాడు నిందితుడు.

పూర్తి వివరాల్లోకి వెళితే నిందితుడు అహ్మద్ గోరిపాళ్యకు చెందిన వాడిగా గుర్తించారు. అహ్మద్, బాధిత మహిళ ఇద్దరు అగరబత్తుల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్నారు. అయితే పరిచయం పెంచుకున్న అహ్మద్ తనను పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధించేవాడు. బాధితురాలికి అప్పటికే పెళ్లై ఓ బిడ్డ కూడా ఉంది. ఈ క్రమంలోనే అహ్మద్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో శుక్రవారం ఉదయం యాసిడ్ దాడి చేశాడు. అయితే యాసిడ్ దాడి నుంచి బాధితురాలు ప్రాణాలు దక్కించుకున్నా.. ఆమె కుడి కన్ను దెబ్బతిందని.. ఆమె చూపు 70 శాతం మాత్రమే ఉందని, కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు.

బాధిత మహిళ కుమారస్వామి లేఅవుట్ నుంచి జేపీ నగర్ వెళుతుండగా సారక్కి జంక్షన్ సమీపంలో ఆమెపై యాసిడ్ పోసి అక్కడి నుంచి అహ్మద్ పారిపోయాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో గత రెండు నెలల్లో మూడో యాసిడ్ దాడి. ఈ ఘటనపై హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ యాసిడ్‌ విక్రయాలను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని, దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.

Exit mobile version