Site icon NTV Telugu

Manipur Violence: మణిపూర్‌లో మరోసారి హింసాకాండ.. ఒకరి మృతి, ఇళ్లు దగ్ధం..

Manipur Violence

Manipur Violence

Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మూడు వారాలుగా ఈ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. మైయిటీ, కుకీ జాతుల మధ్య ఘర్షణ క్రమంగా హింసాత్మక మారాయి. తాజాగా ఈ రోజు మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. తాజాగా బుధవారం చోటు చేసుకున్న హింసలో బుల్లెట్ గాయాలకు 29 ఏళ్ల యువకుడు మరణించాడు. వేరే వర్గానికి చెందిన వారు కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు గాయపడ్డారు.

ఈ సంఘటనల దృష్ట్యా, బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ మూడు జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును జిల్లా అధికారులు రద్దు చేశారు. గతంలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. బిష్ణుపూర్ జిల్లా మోయిరాంగ్‌లోని కొన్ని గ్రామాలపై సాయుధ యువకులు ఈరోజు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తోయిజం చంద్రమణి అనే వ్యక్తి బుల్లెట్ గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Read Also: Meta Layoffs: మెటా మూడో రౌండ్ లేఆఫ్స్.. 5000 మంది ఉద్యోగాలు ఊస్ట్..

ఈ మరణంతో ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితిని నియంత్రించడానికి అదనపు పారామిలిటీరీ, పోలీస్ సిబ్బందిని మోహరించారు. మంగళవారం రాత్రి బిష్ణుపూర్ లోని ఫౌబక్‌చావోలో మూడు ఇళ్లను తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రతీకారంగా మరో వర్గానికి చెందిన యువకులు నాలుగు ఇళ్లను తగులబెట్టారు. మణిపూర్ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 11 జిల్లాల్లో హింసకు ప్రభావితం అయ్యాయి. మే 3 నుంచి రాష్ట్రంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ 11 జిల్లాల్లోని 23 అత్యంత సున్నితమైన మోహరించారు. మరిన్ని కేంద్ర బలగాలను పంపాల్సిందిగా సీఎం బీరెన్ సింగ్ కోరారు.

మెయిటీ కమ్యూనిటీకి గిరిజన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్న కుకీ, నాగా వంటి గిరిజన జాతులు నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’లో హింస చెలరేగింది. ఇది క్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపించింది. మణిపూర్ లో 53 శాతం మంది మెయిటీ కమ్యూనిటీ ఉన్నారు. ఈ హింసకాండ వల్ల ఇప్పటి వరకు 71 మంది మరణించారు. పోలీస్ సిబ్బందితో సహా 300 మంది గాయపడ్డారు. 1700 ఇళ్లు దగ్ధమయ్యాయి. 200 కన్నా ఎక్కువ వాహనాలకు నిప్పుపెట్టారు.

Exit mobile version