Site icon NTV Telugu

Matrimony Fraud: మ్యాట్రిమోనీలో పరిచయం.. లక్షల్లో ప్యాకేజీ అని అత్యాచారం

Matrimony Fraud

Matrimony Fraud

Man Rapes, Cheats Woman Of ₹ 30 Lakh After Friendship On Matrimony Site: ఇటీవల కాలంలో మాట్రిమోనీ మోసాలు పెరుతున్నాయి. తల్లిదండ్రులు తమ అమ్మాయి భవిష్యత్తు కోసం లక్షల్లో జీతాలు, ల్యాండ్స్, బిల్డింగ్స్ ఉండే వరుడిని వెతుకుతున్నారు. ఈ ఆశల్లో పడిపోయి అసలు విషయాన్ని మరిచిపోతున్నారు. అసలు అబ్బాయి మంచివాడా..? సరైనవాడా..? అని ఆలోచించడం లేదు. ఇదే కొంతమంది మోసగాళ్లకు వరంగా మారుతోంది. తప్పుడు జీతాలు, పైపై మెరుగులతో అమ్మాయిను మోసం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇదే తరహా మోసం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనియల్ సైట్ లో పరిచయం అయిన వ్యక్తిని నమ్మిన మహిళ దారుణంగా మోసపోయింది. ఓ ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి తనను తాను టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ లో రూ. 35 లక్షల వార్షిక ప్యాకేజీలో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి ఓ అమ్మాయికి దగ్గరై ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు రూ. 30 లక్షలతో ఉడాయించాడు. ఈ కేసులో నోయిడా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Read Also: YS Sharmila: షర్మిల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్, బాల్క సుమన్‌లపై ఫైర్

రూ.35 లక్షల ప్యాకేజీతో హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్నట్లు సదరు నిందితుడు రాహుల్ చతుర్వేదితో పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ వివరాలకు టెంప్ట్ అయిన సదరు యువతి, నిందితుడితో వాట్సాప్ చాటింగ్స్ చేయడం ప్రారంభించింది. నిందితుడి మాయమాటలకు పడిపోయిన యువతి అతనిలో కలుసుకునేందుకు తరుచుగా వెళ్లేది. ఈ క్రమంలో ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని యువతిని నమ్మించాడు. నాలుగు నెలల క్రితం నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పెళ్లి హామీ ఇవ్వడంతో ఇద్దరు శారీరకంగా కలుసుకున్నారు. ఈ క్రమంలో తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతోందని చెప్పి యువతి దగ్గర నుంచి రూ. 30 లక్షలు తీసుకుని ఉడాయించాడు.

ఈ ఘటన తర్వాత ఫోన్ నెంబర్ మార్చడంతో పాటు ఎన్నిసార్లు ప్రయత్నించినా నిందితుడిని, యుంతి కలుసుకోలేకపోయింది. దీంతో అనుమానం వచ్చిన యువతి సదురు కంపెనీని సంప్రదించడంతో రాహుల్ చతుర్వేది అని ఎవరూ పనిచేయడం లేదని తెలుసుకుంది. దీంతో తను మోసపోయినట్లు గ్రహించింది. దీనిపై నోయిడాలోని సెక్టార్ 24 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది సదురు యువతి. పోలీస్ విచారణలో నిందితుడి బాగోతం మొత్తం బయటపడింది. యువతి ఇచ్చిన డబ్బులో హోండా సిటీ కారు, బ్రాండెడ్ దుస్తులు, నగలు కొనుక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు ఘజియాబాద్ లోని ఖోడా ప్రాంతంలో మరో మహిళతో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై రేప్, మోసం కేసుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నోయిడా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అశుతోష్ ద్వివేది వెల్లడించారు.

Exit mobile version