NTV Telugu Site icon

Steel Man: ఉక్కు మనిషి.. సెంచరీ దాటేశాడు

Steel Man

Steel Man

Steel Man: ప్రస్తుత జీవన శైలితో మానవుని సగటు జీవితం 60 నుంచి 70 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ గత జనరేషన్‌ వారు అక్కడక్కడా సెంచరీ వయస్సు దాటినా వారు కూడా కనిపిస్తుంటారు. అయితే సెంచరీ దాటిన వారు ఇంట్లోనే ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడో స్టీల్‌ మ్యాన్‌ ఉన్నాడు. ఆయన వయస్సు సెంచరీ దాటింది. అయినా ఇప్పటికీ ఉక్కు మనిషిలాగా ఉంటాడు.. చాలా చలాకీగా ఉన్నాడు. పైగా ఆయన అంతర్జాతీయ అథ్లెట్‌ కావడం మరో విశేషం.. ఈ ఏడాది చివర్లో.. వచ్చే ఏడాదిలో జరిగే అథ్లెటిక్‌ పోటీల్లోనూ పాల్గొంటున్నారు.. ఇంతకీ ఎవరా? ఉక్కు మనిషీ.. ఏమీటా? కథ అనుకుంటున్నారా? అయితే ఆలస్యమెందుకు.. ఇది చదవండి..

Read also: Mitali Sharma: ఆత్రం ఆగలేదు.. పోస్టింగ్ వచ్చినరోజే లంచం తీసుకుంది.. అరెస్ట్ అయింది

రోజుకు రెండు మూడు గంటల నడక.. ఎనిమిది గంటల నిద్ర.. కొద్దిసేపు వ్యాయామం.. ఒంటిపూట భోజనం.. మితాహారం.. ఇది ఆయన రోజువారీ జీవన శైలి.. దాదాపు యాభై ఏళ్ల నుంచి ఇదేవిధంగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు వందేళ్లు దాటాయి… అయినా ఇప్పటికీ తన జీవన శైలిలో మార్పు లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.. ఆయన ఈ రోజు తన 101 ఏట అడుగు పెడుతున్నారు. ఆయనే పేరు వి శ్రీరాములు.. సొంతరూ మచిలీపట్నం.. స్థిరపడింది విశాఖపట్నం. 1923 జూలై 18న దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన తన 21వ ఏట అంటే 27 మార్చి 1944లో అప్పటి రాయల్‌ ఇండియన్‌ నేవీలో చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌గా చేరారు. 1979 డిసెంబర్‌ 31న కమాండర్‌ హోదాలో పదవీ విరమణ చేసి విశాఖలో స్థిరపడ్డారు. దేశంలో నేవీలో పనిచేసి వందేళ్లకు పైగా జీవించి ఉన్న ఏకైక అథ్లెట్‌ శ్రీరాములు నేడు 101వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

Read also: Amala Paul: కొండల అందాలను కొంటెగా ఎంజాయ్ చేస్తున్న అమలాపాల్

రిటైర్‌మెంట్‌ తరువాత రేస్‌ వాకింగ్‌తో పాటు రన్నింగ్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో వంటి ఆటల్లోనూ సత్తా చాటుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. ఏసియన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ 5, 10, 20 కి.మీ. రేస్‌ వాకింగ్‌ పోటీల్లో 9 బంగారు, 5 రజత, 2 కాంస్య పతకాలు, వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ప్స్‌లో 5 బంగారు, 3 రజత పతకాలను కైవసం చేసుకున్నారు. వెటరన్స్‌ (మాస్టర్స్‌) కేటగిరీలో ఇప్పటికీ ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొంటూ బంగారు, రజత, కాంస్య పతకాలను సాధిస్తూనే ఉన్నారు. పర్వతారోహణంపైనా మక్కువ ఉన్న శ్రీరాములు 79వ ఏట తన కుమారుడు సాగర్‌తో కలిసి 2002లో ఆఫ్రికాలోని కిలీమాంజారో, 81వ ఏట 2004లో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు, 83వ ఏట హిమాలయాల్లోని పిండారీ గ్లేసియర్‌లను అధిరోహించారు.

Read also: Janhvi Kapoor: కుక్కతో క్యూట్ గర్ల్ జాన్వీ

శ్రీరాములు 101వ ఏట ఈ ఏడాది నవంబరు 8–12 వరకు ఫిలిప్పీన్స్‌లో జరిగే ఏసియన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ కాంపిటిషన్స్‌లో, వచ్చే ఏడాది జూన్‌లో స్వీడన్‌లో నిర్వహించే వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌–2024 పోటీలకు సిద్ధమవుతున్నారు. వందేళ్ల వయస్సులోనూ ఆయన పుస్తకాలు బాగా చదువుతారు. ఆస్ర్టానమీ, జియో పాలిటిక్స్, నేవీకి సంబంధించిన అంశాలపై ఆసక్తి కనబరుస్తారు. పిల్లలు స్థిరపడటంతో తన భార్యతో కలిసి విశాఖలో ఉంటున్నారు.