దేశంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య.. అన్నాదమ్ముల మధ్య.. తల్లిదండ్రులు.. పిల్లల మధ్య బంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. కుటుంబాల్లో మునుపటి అనురాగాలు నేడు కనుమరుగైపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతోంది. దీంతో బంధాలు మరిచి.. రక్తసంబంధికులే కనికరం లేకుండా కడతేర్చేస్తున్నారు. ఇలాంటి నేరాలు-ఘోరాలు దేశంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా పడక సుఖం కోసం కట్టుకున్న భర్తనే ఓ ఇల్లాలు ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: PM Modi: టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోడీ.. ఎప్పుడంటే..!
విజయ్ కుమార్, ధనంజయ ఇద్దరూ బాల్య స్నేహితులు. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో కలిసి పెరిగారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా స్నేహం ఉంది. అయితే విజయ్ కుమార్(39) రియల్ ఎస్టేల్, ఫైనాన్స్ లావాదేవీలు ఉన్నాయి. విజయ్ పదేళ్ల క్రితం ఆశా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం కామాక్షిపాల్యలో కాపురం పెట్టారు. అయితే ఈ మధ్య స్నేహితుడు ధనంజయతో ఆశా ఏకాంతంగా ఉన్నప్పుడు విజయ్ చూసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అంతేకాకుండా వారిద్దరికి సంబంధించిన ఫొటోలు కూడా కనిపించాయి. దీంతో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో భార్య ఆశాను తీసుకుని కడబగెరె ప్రాంతంలోని మాచోహళ్లిలో అద్దె ఇంటికి మారారు. అయినా కూడా ధనంజయ-ఆశాలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. స్థలం మారినా.. ఇద్దరూ కూడా సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో తమ సుఖానికి విజయ్ అడ్డొస్తున్నాడని చంపేయాలని ఇద్దరూ కుట్ర పన్నారు.
ఇది కూడా చదవండి: AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఇందులో భాగంగా మాచోహల్లిలోని డీగ్రూప్ లేఅవుట్ దగ్గర విజయ్ శవమై కనిపించాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా హత్యగా భావించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆశా-ధనంజయ అక్రమ సంబంధం బయటపడింది. ఇద్దరూ కలిసి విజయ్‌ను చంపేసినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆశా పోలీసుల అదుపులో ఉండగా.. ధనంజయ పరారీలో ఉన్నాడు. వివాహేతర సంబంధానికి విజయ్ అడ్డుగా ఉన్నాడనే చంపేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
