NTV Telugu Site icon

Jharkhand: శ్రద్ధా వాకర్ తరహాలో భార్య హత్య.. శరీరాన్ని 12 ముక్కలుగా నరికిన భర్త

Jarkhand

Jarkhand

Man hacks wife to death in Jharkhand, chops her body into 12 pieces: ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యను ఇంకా దేశం మరిచిపోలేదు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనలు దేశంలో ఇటీవల కాలంలో బయటపడుతున్నాయి. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాలా హత్యచేసి శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. అయితే తాజాగా జార్ఖండ్ లో ఇలాంటి తరహా హత్య జరిగింది. సాహెబ్ గంజ్ లో తన భార్యను నరికి, మృతదేహాన్ని 12 ముక్కలుగా చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోరియో పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

సంతాలీ మోమిన్ తోలా ప్రాంతంలో పాత ఇంటిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రబికా పహాడిన్ అనే బాధితురాలిని ఆమె భర్త దిల్దార్ అన్సారీ హత్య చేసినట్లు విచారణలో తేలింది. రుబికా, దిల్దార్ కు రెండో భార్య. గత రెండేళ్లుగా వీరిద్దరు ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు రుబికా మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో రుబికా చిధ్రమైన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Fraud Lady Arrest: సోషల్ మీడియాలో యువకులే టార్గెట్.. కిలాడీ లేడీ అరెస్ట్

పహాడీ తెగకు చెందిన రుబికా పహాడిన్ గా బాధితురాలిని గుర్తించినట్లు సాహెబ్ గంజ్ ఎస్పీ వెల్లడించారు. నిందితుడు ఎలక్ట్రిక్ కట్టర్ వంటి పదునైన వస్తువును వాడి మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే జార్ఖండ్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రవిమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయిని ఆరోపించింది. హేమంత్ సర్కార్ హయాంలో గిరిజనులు, హిందువులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించింది. మైనారిటీ వర్గానికి చెందిన కొంతమంది ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేవ్ అన్నారు.

Show comments