NTV Telugu Site icon

Uttar Pradesh: మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది.. చివరకు కరెంట్ షాక్‌తో చంపిన భర్త

Uttarpradesh

Uttarpradesh

Man electrocutes wife to death, buries body in room: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న మహిళను భర్తే దారుణంగా హత్య చేశాడు. లఖీంపూర్ లోని గోలా గోకరన్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి తన భార్యను విద్యుత్ షాక్ కు గురిచేసి చంపేశాడు. చిన్న గొడవ చిలికిచిలికి భార్య మరణానికి దారి తీసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే..ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించినా నిందితుడి కన్నతల్లే పోలీసులకు హత్య గురించి తెలిపింది.

Read Also: Nepal: నేపాల్ లో రాజకీయ సంక్షోభం.. ప్రభుత్వానికి ప్రచండ మద్దతు ఉపసంహరణ

పూర్తి వివరాల్లోకి వెళితే.. నిందితుడు మహ్మద్ వాషి కొన్నేళ్ల క్రితం ఉషాశర్మ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఉషాశర్మ ఇస్లాం మతాన్ని స్వీకరించి అక్సా ఫాతిమాగా మారిన తర్వాత కొన్నేళ్లుకు ఆమెను వివాహం చేసుకున్నాడు. నిద్రపోయే ముందు మహ్మద్ వాషి తన భార్యతో గొడవపడ్డాడు. ఆమె నిద్రపోయిన తర్వాత ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఆ తరువాత విద్యుత్ షాక్ ఇచ్చి చంపేశాడు. నిందితుడు ఆమెను అదే గదిలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. తనను పట్టుకోబడకుండా ఉండటానికి రెండు రోజుల పాటు ఒకే గదిలో పడుకున్నాడు.

ఇదిలా ఉంటే నిందితుడి తల్లి ఇంటికి వచ్చే సరికి కోడలు లేకపోవడంతో ప్రశ్నించింది. దీంతో ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిపై హత్యానేరం కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేవారు.

Show comments