NTV Telugu Site icon

Jallikattu: తమిళనాడు జల్లికట్టులో విషాదం.. ఎద్దు కుమ్మడంతో యువకుడికి గుండెపోటు..

Man Dies After Bull Jabs

Man Dies After Bull Jabs

Jallikattu: తమిళనాడు జల్లికట్టు వేడులకల్లో విషాదం నెలకొంది. శివగంగలోని కారైకుడిలో నిర్వహించిన మంజువిరాట్టు కార్యక్రమంలో ఎద్దు దాడిలో ఓ యువకుడు మరణించాడు. ఎద్దును మచ్చిక చేసుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎద్దు కుమ్మడంతో 28 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ కార్యక్రమం కోసం మొత్తం 10 ఎద్దుల్ని తీసుకువచ్చారు. ప్రతీ ఎద్దుని 30 నిమిషాల పాటు మైదానంలో ఉంచుతారు. తొమ్మిది మంది వ్యక్తులు వాటిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు.

Read Also: Marriage On Video Call: సరిహద్దు దాటిన మరో పాక్ మహిళ.. రాజస్థాన్ వ్యక్తితో వీడియో కాల్‌లో పెళ్లి..

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మదురై, తిరుచ్చి, రామనాథపురం, పుదుకొట్టై సహా పలు జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అయితే, ఈ ఈవెంట్ నాలుగో రౌండ్‌లో సేలంకి చెందిన కార్తీక్ అనే యువకుడు దూసుకువెళ్తున్న ఎద్దును తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ ఎద్దు అతడి ఛాతీపై బలంగా కమ్మింది. దీంతో వెంటనే కార్తీక నెలపై పడిపోయాడు. ఎద్దు కొమ్ముల కారణంగా గాయాలు కావడంతో పాటు బలంగా ఛాతీపై కుమ్మడంతో గుండెపోటుతో కార్తీక్ మరణించినట్లు వైద్యలు తేల్చారు. ఈ విషాదంతో ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేశారు. దీనిపై విచారణ జరుగుతోందని కుంద్రకుడి పోలీసులు తెలిపారు.