NTV Telugu Site icon

Man Chops Woman Body: మహిళను చంపి ముక్కలు ముక్కలుగా పాతేశాడు..

Crime News 1

Crime News 1

Man Chops Woman Body in jammu kashmir: ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే మరో హత్య జరిగింది. మహిళను చంపి ముక్కలుగా చేసి పాతేశాడు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ బుద్గామ్ లో జరిగింది. పోలీస్ విచారణలో భయానక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే బుద్గామ్ సోయిబుగ్ కు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ మార్చి 8 నుంచి తన సోదరి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 7న కోచింగ్ క్లాసెస్ కు వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన 30 ఏళ్ల యువతి దారుణంగా హత్యకు గురైంది.

Read Also: Bombay High Court: కార్ టైర్ పేలడం “యాక్ట్ ఆఫ్ గాడ్” కాదు.. ఇన్సూరెన్స్ చెల్లించాల్సిందే..

విచారణ ప్రారంభించిన పోలీసులు అనుమానితులను ప్రశ్నించారు. బుద్గామ్ లోని మొహంద్‌పోరాకు చెందిన షబీర్ అహ్మద్ వానీ(45) నిందితుడిగా తేలింది. కార్పెంటర్ గా పనిచేస్తున్న షబీర్ అహ్మద్ వానీ మహిళను చంపేసి ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టానని విచారణలో అంగీకరించాడు. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం వివిధ ప్రాంతాల నుంచి మహిళ అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. చంపేసిన తర్వాత ఎవరికి పోలీసుకు చిక్కకుండా ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న రైల్వే బ్రిడ్జ్ సమీపంలోని వివిధ ప్రాంతాల్లో తల, ఇతర శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

వారం వ్యవధిలో జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి ఘటన జరిగడం ఇది రెండోది. జమ్మూలో లో ఓ మహిళా డాక్టర్ ని ఆమె ప్రియుడు హత్య చేశాడు. కత్తితో పొడిచి ప్రియురాలిని చంపాడు. ఆ తరువాత అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం నిందితుడు జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు.