Site icon NTV Telugu

Happy Divorce: “కొడుకుకు తల్లి పాలాభిషేకం, కేక్ కటింగ్”.. విడాకుల సెలబ్రేషన్ వీడియో వైరల్..

Happy Divorce

Happy Divorce

Happy Divorce: ఇటీవల కాలం భర్తల్ని చంపుతున్న భార్యల ఘటనలు చూస్తూనే ఉన్నాం. నకిలీ వేధింపులు కేసులు బనాయిస్తూ భార్యలు, వారి బంధువులు కట్టుకున్న వాడికి నరకం చూపిస్తున్నారు. దీనికి ఒక చక్కని ఉదాహరణే బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం. ఈ ఘటన, తర్వాత ఇలాగే నకిలీ గృహహింస వేధింపుల కారణంగా చాలా మంది తనువు చాలించుకున్నారు.

Read Also: Care Hospitals: డాక్టర్ పవన్ కుమార్‌ను సీఈఓ గా నియమించిన కేర్ హాస్పిటల్స్

ఇది చాలదన్నట్లుగా వివాహాన్ని ఒక బిజినెస్‌గా చూస్తున్న వారు కూడా ఉన్నారు. పెళ్లయిన కొన్ని నెలలకే కోట్ల రూపాయల భరణాన్ని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. భరణానికి సంబంధించిన కేసులపై పలు సందర్భాల్లు సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో చాలా మగాళ్లు వివాహ వేధింపుల నుంచి బయటపడేందుకు విడాకులు కోరుతున్నారు.

తాజాగా, భార్య నుంచి విడాకులు తీసుకున్న వ్యక్తి, తన విడాకుల్ని సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి తల్లి స్వయంగా పాలాభిషేకం చేశారు. కొత్త బట్టలు ధరించి, పెళ్లి కొడుకులా ముస్తాబై, తన విడాకులను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ‘‘హ్యపీ డివోర్స్ 120 గ్రాముల బంగారం, 18 లక్షల నగదు’’ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేశారు. ‘‘నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, స్వేచ్ఛగా ఉన్నాను- నా జీవితం, నా నియమాలు ’’ అని పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వైరల్ వీడియో లక్షల్లో వ్యూస్ దక్కించుకుంది.

Exit mobile version