Patna High Court: అసభ్యకరమైన భాషలో తిట్టుకున్న భార్య, భర్తల కేసులో పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యని ‘భూతం’, ‘పిశాచి’ అని పిలువడం క్రూరత్వం కిందకు రాదని కోర్టు పేర్కొంది. జార్ఖండ్ బొకారో నివాసి అయిన సహదేశ్ గుప్తా, అతని కొడుకు నరేష్ కుమార్ గుప్తాలు దాఖలు చేసిన పిటిషన్‌ని జస్టిస్ బిబేక్ చౌధురి సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. నరేష్ గుప్తా నుంచి విడాకులు తీసుకున్న భార్య సొంత ప్రాంతమైన బీహార్‌లోని నవడాలో తండ్రి కొడుకులపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో బీహార్ నలంద జిల్లా కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను వీరిద్దరు ఛాలెంజ్ చేశారు.
Read Also: Vijay Deverakonda: స్టార్ హీరోతో స్టేజ్ పై స్టెప్పులేసిన రౌడీ హీరో.. వీడియో వైరల్..
భార్య 1994లో తన భర్త, అత్తవారిపై కేసు నమోదు చేసింది. కట్నం, కారు కోసం డిమాండ్ చేయడమే కాకుండా, భౌతికంగా హింసకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ కేసులో 2008లో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ద్వారా తండ్రీకొడుకులకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ కేసు నవడా నుంచి నలందాకు ట్రాన్స్‌ఫర్ చేయబడింది. ఈలోగా ఈ జంటకు జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
తండ్రీ కొడుకులు ఇద్దరు పాట్నా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని వ్యతిరేకిస్తూ.. విడాకులు తీసుకున్న మహిళ తరుపు న్యాయవాది..‘‘21వ శతాబ్ధంలో ఒక మహిళని భూతం, పిశాచి అని పిలిచారని, ఇది క్రూరత్వం కిందకు వస్తుంది వాదించారు. అయితే, కోర్టు ఇలాంటి వాదనల్ని అంగీకరించే పరిస్థితి లేదని పేర్కొంది. వైవాహిక సంబంధాల్లో, ముఖ్యంగా విఫలమైన వివాహ సంబంధాల్లో భార్యభర్తలు ఇద్దరూ ఒకరినొకరు దుర్భాషలాడుతూ, అసభ్యకరమైన పదజాలంతో దూషించుకున్న సందర్భాలు ఉన్నాయని, అయితే, ఇలాంటివి క్రూరత్వం కిందకు రావని కోర్టు పేర్కొంది. మహిళను సదరు వ్యక్తులు వేధించారని హైకోర్టు పేర్కొంది.
